• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Smartphones of 2023: గతేడాది వచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే!

    గత సంవత్సరాలతో పోలిస్తే 2023లో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి. ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు పదుల సంఖ్యలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్న ఫోన్లను లాంచ్‌ చేసి టెక్‌ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. వీటిలో కొన్ని మాత్రమే యూజర్ల మన్ననలు పొందాయి. తద్వారా 2023 ఏడాదికి గాను బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లుగా నిలిచాయి. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి? వాటి ధర, ఫీచర్లు ఏంటి? ఇప్పుడు చూద్దాం. 

    OnePlus Open

    ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ తన తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘OnePlus Open’ను గతేడాది అక్టోబర్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 7.82 అంగుళాల అమోలెడ్‌ లోపలి డిస్‌ప్లేను, 6.31 అంగుళాల అవుటర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 48 MP + 64 MP + 48 MP రియర్‌ కెమెరా సెటప్‌, 20MP + 32MP సెల్ఫీ కెమెరాలు, 4800mAh బ్యాటరీ వంటి ఫీచర్లను ఈ ఫోన్‌ కలిగి ఉంది. దీని ధర రూ.1,39,999.

    Motorola Razr 40 Ultra

    Motorola గతేడాది నవంబర్‌లో ‘Moto Razr 40 Ultra’ ఫ్లిప్ ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇది కూడా యూజర్ల నుంచి మంచి ఆదరణను పొందింది. ఈ ఫోన్‌  6.9 అంగుళాల ప్రైమరి డిస్‌ప్లే, 3.6 అంగుళాల సెకండరీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 12MP + 13MP రియర్ కెమెరా సెటప్‌, 32MP సెల్ఫీ కెమెరా, 3800mAh బ్యాటరీ, 8GB RAM + 256GB స్టోరేజ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.72,999గా ఉంది.

    Samsung Galaxy S23 Ultra

    శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రాను గతేడాది వచ్చిన అత్యుత్తమైన మెుబైల్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 12GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. Snapdragon 8 Gen 2 కలిగి ఉంటుంది. ఫోన్‌లో 3088×1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల QHD + డైనమిక్ AMOLEDని అందుబాటులో ఉన్నాయి. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా పాటు అదనంగా 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు లభించనున్నాయి. 45W బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా లభిస్తుంది. ఇందులో మీరు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా పొందుతారు. దీని ధర అమెజాన్‌లో రూ.1,24,999గా ఉంది. 

    Apple iPhone 15 Pro Max

    యాపిల్‌ గతేడాది విడుదల చేసిన Iphone 15 Pro Max మెుబైల్‌ ఫీచర్ల పరంగా బెస్ట్‌ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2796‑1290 పిక్సెల్స్‌ రిజల్యూషన్ అందించారు. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ + 12MP టెలిఫొటో సెన్సార్లను ఫోన్ వెనుక భాగంలో అందించారు. ఈ ఫోన్‌ ధర రూ.1,56,900.

    Google Pixel 7a

    పిక్సెల్ ఏ లైనప్‍లో Google Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్‌ లాంచ్ చేసింది. 6.1 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ OLED డిస్‍ప్లేతో గూగుల్ పిక్సెల్ 7ఏ వచ్చింది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఫోన్‌లో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు. 18 Wt ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 4,385 బ్యాటరీని కూడా అందించారు. దీని ధర రూ.39,999గా ఉంది.

    Nothing Phone 2

    గతేడాది జులైలో విడుదలైన నధింగ్‌ ఫోన్‌ 2కు టెక్‌ ప్రియుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోన్‌  6.7 అంగుళాల OLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. మెుబైల్‌ వెనక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + 50MP అల్ట్రావైడ్‌  సెన్సార్‌తో పాటు ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేశారు. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో ఉంది. ఈ ఫోన్‌ ధర రూ.39,999గా ఉంది. 

    iQoo Neo 7 Pro

    గతేడాది జులైలో iQoo Neo 7 Pro మెుబైల్‌ దేశీయ మార్కెట్‌లో విడుదలైంది. ఈ  మెుబైల్ 6.78 అంగుళాల స్క్రీన్, 50MP + 8MP + 2MP రియర్ కెమెరా సెటప్‌, 16MP సెల్పీ కెమెరా 8GB RAM / 128GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది అమెజాన్‌లో రూ.32,999లకు సేల్ అవుతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv