పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో శేఖర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగువారికి తగినట్లుగా కథలో మార్పులు చేర్పులు చేశాడు. డైలాగ్స్, స్క్రీన్‌ప్లై కూడా అందించాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
భీమ్లానాయక్ ఒక సిన్సియర్ పోలీసాఫీసర్. కర్నూలు జిల్లా హఠకేశ్వరం మండలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తుంటాడు. డానియల్ శేఖర్(రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్ అవుతాడు. రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒకరోజు భీమ్లానాయక్ డ్యూటీలో ఉండగా రాత్రి పూట అడవిలో మద్యం సీసాలతో వెళ్తున్న వాహనాలను చెక్ చేస్తారు. అందులో డానియల్ శేఖర్ ఉంటాడు. పోలీసులు ఆపినందుకు వాళ్లతో గొడవపెట్టుకుంటాడు. దీంతో భీమ్లానాయక్, డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. దీంతో అహంకారం దెబ్బతిన్న డానియల్ భీమ్లానాయక్‌పై పగను పెంచుకుంటాడు. ఉద్యోగం చూసుకొని ఇదంతా చేస్తున్నాడు కాబట్టి ఉద్యోగం లేకుండా చేయాలనుకుంటాడు. రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం కావడంతో దాన్ని ఉపయోగించుకొని భీమ్లానాయక్‌పై పగను తీర్చుకోవాలనుకుంటాడు. ఈ ఒక్క సంఘటనతో ఇద్దరికీ అంత వైరుధ్యం ఎందుకు ఏర్పడింది. భీమ్లానాయక్ ఉద్యోగం ఎలా పోయింది. చివరికి ఇద్దరు ఈ యుద్ధాన్ని ఎలా ముగించారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధమే ఈ సినిమా కథ అని పవన్‌కళ్యాణ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఇక్కడ హీరోలు, విలన్లు ఎవరు లేరు. ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తులు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి ఎంతకైనా తెగించే వ్యక్తులు ఎదురుపడితే ఆ పరిస్థితులు ఎంతవరకు తీసుకెళ్తాయి. ఎవరూ తగ్గకపోతే దానికి అంతం ఎక్కడ ఉంటుంది..? చివరికి ఏది నెగ్గుతుంది..? అని చూపించడమే సినిమా కథ. పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్‌కు తగినట్లుగా సినిమాలో మార్పులు చేసి మరికొన్ని సీన్లను జోడించారు త్రివిక్రమ్. భీమ్లానాయక్ చెప్పే డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడతాయి. రానా కూడా తన మార్క్ నటనను కనబరిచాడు. డానియల్ శేఖర్‌గా రాజకీయ నేపథ్యం ఉందన్న అహంకారం ఉన్న వ్యక్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. నిత్యామీనన్ భీమ్లానాయక్ భార్యగా నటించింది. సంయుక్త మీనన్ డానియల్ శేఖర్ భార్యగా కనిపించింది. మలయాళంలో లేని కొన్ని సీన్లను తెలుగులో నిత్యామీనన్ పాత్రకు చేర్చారు. భీమ్లానాయక్ చేసే ప్రతి పనిలో తోడుగా ఉంటే భార్యగా ఆమె నటన ఆకట్టుకుంది.
ట్రైలర్‌లో తమన్ మ్యూజిక్ బాగాలేదంటూ విమర్శలు చేసిన వారే ఇప్పుడు థియేటర్లు దద్ధరిల్లిపోతున్నాయంటూ చెప్తున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరింత ఎలివేట్ చేసింది. పాటలు ఇదివరకే సూపర్‌హిట్ అయ్యాయి. లాలా భీమ్లా పాట విజువల్‌గా కేకలు పెట్టిస్తుంది. రీమేక్ మూవీని మనవారికి తగినట్లుగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ 3.5/5
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!