బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన రెండు రోజులకే హౌస్లో నామినేషన్ల సందడి మొదలైంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లో జూనియర్స్, సీనియర్స్ మధ్య వార్ నడుస్తోంది. వారియర్స్ లలో ఇద్దరిని ఛాలెంజర్లుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ జూనియర్‌లను కోరారు. మొదట యాంకర్ శివ, సరయు, ముమైత్ ఖాన్ నామినేట్ అయ్యారు. ఇద్దరికీ దూకుడు అనే ట్యాగ్ పెట్టారు. బాండింగ్ అస్సలు కనెక్ట్ కాలేదని మిత్ర శర్మ అరియానాను నామినేట్ చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ చాలా పక్షపాతం చూపిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత హమీదాను, నటరాజ్ మాస్టర్ను ఆర్జే చైతు నామినేట్ చేశాడు. శ్రీరాపాక అరియానాను, ముమైత్ ఖాన్‌ను నామినేట్ చేసింది. అజయ్ నటరాజ్ మాస్టర్‌తో పాటు సరయును నామినేట్ చేశాడు. తర్వాత అనిల్ నటరాజ్ మాస్టర్, సరయులను కూడా నామినేట్ చేశాడు. బిందు మాధవి అఖిల్, ముమైత్ ఖాన్‌ను నామినేట్ చేసింది. స్రవంతి హమీద, నటరాజ్ మాస్టర్‌లను నామినేట్ చేసింది. నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, సరయులను ఛాలెంజర్లుగా ఉన్న జూనియర్లందరూ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వీరు అత్యధికంగా నామినేట్ అయ్యారు. దీంతో నాటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్ ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
News Telangana
బండి సంజయ్ ఎవడ్రా: బాబు మోహన్ బూతు పురాణం