నటీనటులు: సోహెల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్ రోహిణి తదితరులు
దర్శకుడు : కోనేటి శ్రీను
నిర్మాత: ఎండీ పాషా
సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటింగ్: వినయ్ రామస్వామి
విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024
బిగ్‌బాస్ (Bigg Boss Telugu))తో వచ్చిన ఫేమ్‌ను కాపాడుకుంటూ నటుడు సోహైల్ (Sohel) ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తో మెప్పించిన ఇతడు తాజాగా (ఫిబ్రవరి 2న) ‘బూట్‌కట్ బాలరాజు’ (Bootcut Balaraju)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సోహైల్ నిర్మాతగానూ వ్యవహరించాడు. మేఘలేఖ హీరోయిన్‌గా నటించగా సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సోహెల్‌కు విజయాన్ని అందించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
బూట్ కట్ బాలరాజు (సోహెల్) ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ) కూతురు మహాలక్ష్మి (మేఘ లేఖ) బాలరాజుతో చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలరాజు – మహాలక్ష్మి ప్రేమించుకుంటారు. మరోవైపు బాలరాజును సిరి (సిరి హనుమంతు) కూడా ప్రేమిస్తుంటుంది. అయితే బాలరాజు – మహాలక్ష్మి ప్రేమ కథకి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఎందుకు బాలరాజు సర్పంచ్‌గా పోటీ చేస్తాడు? పటేలమ్మపై బాలరాజు గెలిచాడా? లేదా? అనేది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
ఇందులో సోహైల్.. హైపర్ యాక్టివ్‌గా ఉండే కుర్రాడిలా (Bootcut Balaraju Review) మెప్పించాడు. చక్కటి భావోద్వేగాలను పలికించాడు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరమ్మాయిగా ఒదిగిపోయింది. మరో హీరోయిన్ సిరి హనుమంత్ కూడా చాలా బాగా నటించింది. బాలరాజు ఫ్రెండ్స్‌గా అవినాష్, సద్దాం కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు నటించి అలరించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కోనేటి శ్రీను తీసుకున్న కథ, సోహెల్ – ఇంద్రజ పాత్రలు బాగున్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారిన వైనాన్ని చూపించాడు. సెకండాఫ్‌లో బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశాడనేది చూపించాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ సీన్లు మెప్పిస్తాయి. డ్రామా సీన్స్ సినిమాకి బలహీనతగా మారాయి. దర్శకుడు కంటెంట్‌ను స్క్రీన్‌పై బాగా ఎలివేట్ చేసినా.. రొటిన్, బోరింగ్ సీన్స్ వల్ల అది ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను ఇంకా బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bootcut Balaraju Review).. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం పర్వాలేదు. నేపథ్యం సంగీతం కూడా కీలక సన్నివేశాల్లో బాగానే అనిపిస్తుంది. ఎడిటర్ వినయ్ రామస్వామి తన కత్తెరకు మరింత పని కల్పించాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- సోహేల్, ఇంద్రజ నటన
- కామెడీ
- సంగీతం
మైనస్ పాయింట్స్
- కథనం
- బోరింగ్ సీన్లు
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!