ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన బౌల్ట్ ఇయర్ బడ్స్‌ను YouSay Web తాజాగా సమీక్షించడం జరిగింది. రూ. 1500 లోపు ఇయర్ బడ్స్‌లో ఇది గట్టి పోటీనైతే ఇస్తుంది. తాజాగా రిలీజైన బౌల్ట్ Z60 ఇయర్ బడ్స్.. 60 గంటల ప్లే టైమ్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ప్రిమియం ఫీచర్లను అయితే కలిగి ఉంది. మరి బౌల్ట్ తీసుకొచ్చిన ఈ నయా ఇయర్ బడ్స్‌ను ఈ ధరకు కొనొచ్చా లేదా ఓసారి సమీక్షిద్దాం.
బౌల్ట్ కంపెనీ సరికొత్త ఇయర్ బడ్స్‌ను Boult Z60 పేరుతో ఇటీవల సేల్స్‌కు పెట్టింది. దీని ప్రారంభ ధర రూ.1199 కాగా, ఆఫర్ ఫ్రైస్‌తో తొలుత రూ.999 కే లభించింది. ప్రస్తుతం ఈ ఇయర్ బడ్స్‌కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా దీని ధర రూ.1499 వద్ద అమెజాన్ ఈ కామర్స్ సైట్‌లో అయితే లభ్యమవుతోంది.
ఇయర్ బడ్స్‌పై ఈ కామర్స్ సైట్లలో పాజిటివ్ రివ్యూస్ అయితే కనిపిస్తున్నాయి.
సమీక్ష:
బాక్స్‌లో ఏముంటాయంటే
- బౌల్ట్ Z60*ఒక జత
- బౌల్ట్ ఛార్జింగ్ కేస్
- యూజర్ గైడ్
- సెఫ్టీ వారెంటీ కార్డ్
- టైప్ సీ ఛార్జింగ్ కేబుల్
- నాలుగు ఇయర్ టిప్స్
Boult Z60 Review
బౌల్ట్ Z60 డిజైన్ & బిల్డ్ క్వాలిటీ
సమీక్ష కోసం పౌడర్డ్ బ్లూ వేరియంట్ ఇయర్ బడ్స్‌ను తీసుకోవడం జరిగింది. ఇయర్ బడ్స్ చూడగానే అట్రాక్ట్ చేశాయి. నీట్‌గా క్లియర్ లుక్‌ను కలిగి ఉన్నాయి. ఇయర్ బడ్స్ ప్లాస్టిక్ బాడితో తయారయ్యాయి.
ఇయర్ బడ్స్ 13mm లార్జర్ డ్రైవర్ యూనిట్‌ను కలిగి ఉన్నాయి. చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఇచ్చాయి. నార్మల్ సౌండ్‌తో వింటున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ హై బాస్‌తో సాంగ్స్ ఎక్కువసేపు వింటే మాత్రం చెవులు నొప్పి పుట్టినట్లు అనిపించాయి.
దీనిలో సూపర్బ్ ఫీచర్ ఏమిటంటే ఈ ఇయర్ బడ్స్ వాటర్ రెసిస్టెంట్స్‌ను కలిగి ఉండటం.. అది కూడా IPX5 రేటింగ్ ఉండటం గొప్ప విషయం. ఈ రేటింగ్ వల్ల వాటర్, డస్టీ వెదర్ నుంచి ఇయర్ బడ్స్ రక్షణ పొందుతాయి. ఈ వానకాలంలో ఈ ఫీచర్ నిజంగా సూపర్బ్ అని చెప్పవచ్చు.
ఆడియో క్వాలిటీ
ఈ ఇయర్ బడ్స్‌లో ఆడియో క్వాలిటీ మాత్రం క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. రెండు ఇయర్ బడ్స్ చెవుల్లో సరిగ్గా ఇమిడి పోవడం జరిగింది. ఈ ప్రైస్‌లో బెస్ట్ అని చెప్పవచ్చు. డీపెస్ట్ బాస్, క్లిస్టల్ క్లియర్ సౌండ్‌ను అనుభూతి చెందవచ్చు. ఇక కాలింగ్ సమయంలోనూ ఇయర్ బడ్స్ మంచి పనితీరును కనబరిచాయి. దీనిలో ENC ఫీచర్ అవుట్ సైడ్ నాయిస్‌ను దాదాపు 90శాతం వరకు క్యాన్సిల్ చేసింది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా బాగుంది. ప్రతి కాల్ నుంచి క్లియర్ అవుట్ పుట్, ఇన్‌పుట్ అయితే నోటీస్ చేశాం.
బ్యాటరీ లైఫ్
బౌల్ట్ Z60 గేమింగ్ ఇయర్‌బడ్‌లు బ్యాటరీ లైఫ్ పరంగా చాలా బాగుంది. ఈ ఇయర్ బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు కంపెనీ చెప్పిన విధంగా 60 గంటల ప్లేబ్యాక్ అయితే రాలేదు. 50-55 గంటల ప్లే బ్యాక్ మాత్రం లభించింది. బడ్స్‌ను నార్మల్‌గా యూజ్ చేసినప్పుడు 8 గంటల వరకు ప్లేబ్యాక్ అయితే లభించింది. ఇక కాలింగ్ టైంలో మాత్రం కంటిన్యూస్‌గా 4 గంటల పాటు మాట్లాడవచ్చు.
Low Latency Gaming
బౌల్ట్ Z60 ఇయర్ బడ్స్ మరొక సూపర్బ్ ఫీచర్‌ను అయితే కలిగి ఉంది. ‘లో లెటెన్సీ గేమింగ్ మోడ్’. ఇది ఆడియో అవట్‌పుట్‌ను 50ms వరకు తగ్గిస్తుంది. ఇయర్‌బడ్‌లను నాలుగుసార్లు నొక్కడం ద్వారా ఈ మోడ్ యాక్టివేట్ అవుతుంది. గేమర్‌లకు ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది.
IPX5
బౌల్ట్ Z60 ఇయర్‌బడ్స్ IPX5 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్, వెదర్ సీలింగ్‌ను అందిస్తాయి. వీటిని యూజ్ చేస్తూ రోజువారి జిమ్ సెషన్‌లన్నింటినీ పూర్తి చేసుకోవచ్చు. తేలికపాటి వర్షంలో ఇయర్ బడ్స్ వాడిన ఎలాంటి ఇబ్బంది అయికే కలగలేదు.
చివరగా.. కొనొచ్చా
రూ.1,499 ధర వద్ద సరికొత్త Boult Z60 నిజంగా అట్రాక్ట్ చేసిందని చెప్పవచ్చు. ఈ ధర వద్ద ఇది అందిస్తున్న ఫీచర్లను బట్టి చూస్తే దీనిలో లోపాలు వెతికి తీయడం కష్టమని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇయర్ బడ్స్‌లో బెస్ట్ ఛాయిస్‌గా Boult Z60 అని చెప్పవచ్చు. అపరిమిత మ్యూజిక్ స్ట్రీమింగ్, క్రిస్టల్ క్లియర్ వాయిస్, నాయిస్ క్యాన్సలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, చాలా సేపు ఫొన్‌లో మాట్లాడేవారికి ఈ Boult Z60 TWS మంచి ఎంపికగా చెప్పవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?