దీపావళి సందర్భంగా ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక డేటా ఆఫర్లను విడుదల చేసింది. అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. రూ.251, రూ.299, రూ.398, రూ.599, రూ.666 రీఛార్జ్ ప్లాన్లతో అదనపు డేటా లభించనున్నట్లు ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే BSNL సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే ఈ అదనపు డేటా ప్రయోజనం లభించనుంది. మరి ఈ ప్లాన్ల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. దీపావళి సందర్భంగా అదనపు డేటా లభించనుంది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 70 జీబీ డేటా లభించనుంది.దీపావళి సందర్భంగా అదనపు డేటా లభించనుంది. ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. 100SMSలు లభిస్తాయి. BSNL సెల్ఫ్ కేర్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఇక మరో ప్లాన్ రూ.299 రీఛార్జ్‌తో కూడా.. అదనంగా 3 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని రీఛార్జ్‌ను కూడా సెల్ఫ్ కేర్ యాప్‌లో చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారాఇందులో రోజుకు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.
రూ.398తో రీఛార్జ్ చేస్తే.. 120 జీబీ డేటా లభించనుంది. అదనంగా 3 జీబీ డేటా ప్రయోజనం అందుతుంది. వీటితో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉండనుంది.
దీపావళి కానుకగా బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) అందిస్తోన్న మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు రోజుకు 3 జీబీ డేటాను పొందొచ్చు. సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ నైట్ డేటాను కూడాపొందొచ్చు.
దీపావళి కానుకగా ప్రవేశపెట్టిన మరో రీఛార్జ్ ప్లాన్ రూ.666. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 105 రోజుల పాటు అన్‌లిమిటిడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100SMSలు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఎలాంటి డేటా లభించదు. BSNL సెల్ఫ్ కేర్ యాప్‌తో రీఛార్జ్ చేసుకుంటే 3 జీబీ డేటా పొందొచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!