పండగ సీజన్‌లో అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్‌లో భాగంగా బడ్జెట్ ఫోన్లపై 40% వరకూ డిస్కౌంట్ ఇస్తోంది. దసరాకు ముందు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదు. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను వెంటనే ఆర్డర్ చేసేయండి. మరి అమెజాన్‌లో రాయితీతో లభిస్తున్న బడ్జెట్ ఫోన్లు ఏవి? డిస్కౌంట్ ఎంత? వంటి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
Samsung Galaxy A04e
అమెజాన్ పండగ సేల్‌లో ‘Samsung Galaxy A04e’ స్మార్ట్‌ఫోన్ 17% డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.11,999 విలువైన ఈ మెుబైల్‌ను రూ.9,999కే పొందవచ్చు. ఈ ఫోన్.. 6.5 అంగుళాల HD+ స్క్రీన్, 5000 mAh బ్యాటరీ, 13MP + 2MP బ్యాక్ కెమెరా సెటప్, MediaTek Helio P35 ప్రొసెసర్‌ను కలిగి ఉంది.
realme narzo N55
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ స్క్రీన్ ఉంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 64 MP ప్రైమరీ కెమెరా, ఏఐ కెమెరా ఫీచర్లు, ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, ఇతర ఫీచర్లు డివైజ్‌లో ఉన్నాయి. దీని అసలు ధర రూ.14,999. అమెజాన్ ఈ మెుబైల్‌ను 13% రాయితీతో రూ.12,999 అందిస్తోంది.
Redmi 12C
రెడ్‌మీ 12సీ మెుబైల్ స్క్రాచ్ రెసిస్టెంట్ కలిగిన 6.71 అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి శక్తివంతమైన మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌ను అందించారు. 1 GHz CPU, 11 GB RAM (6 GB ఫిజికల్, 5GB వర్చువల్)తో ఈ ఫోన్ గేమింగ్ అవసరాలకు సరిపోతుంది. ఈ ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ. 6,999కే లభిస్తోంది.
Lava Blaze 5G
ఈ లావా మెుబైల్ 6.5 అంగుళాల HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, Android 13 OS, MediaTek Dimensity 700 ప్రొసెసర్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. రూ.14,999 విలువైన ఈ మెుబైల్.. 20% డిస్కౌంట్‌తో రూ.11,999 అందుబాటులోకి వచ్చింది.
realme narzo 50i Prime
రియల్‌మీ నుంచి narzo 50i Prime మెుబైల్ కూడా అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌కు లభిస్తోంది. దీని అసలు ధర రూ.9,999. కానీ, ఈ ఫోన్ 25% డిస్కౌంట్‌తో రూ.7,499 అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్.. 6.5 అంగుళాల HD+ స్క్రీన్, 400 nits బ్రైట్‌నెస్, 8MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Lava Blaze Pro 5G
ఈ మెుబైల్ సైతం అమెజాన్ పండగ సేల్‌లో తక్కువ ప్రైస్‌కే లభిస్తోంది. 14% డిస్కౌంట్‌తో రూ.12,950లకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల FHD+ స్క్రీన్ కలిగి ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా దీనికి ఫిక్స్ చేశారు.
OPPO A18
ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD స్క్రీన్, 5000 mAh బ్యాటరీ, 8MP + 2MP రియర్ కెమెరా సెటప్, 5MP సెల్ఫీ కెమెరా, 5000 mAh లార్జ్ బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ మెుబైల్ సైతం అమెజాన్ పండగ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
Itel P40+
Itel P40+ స్మార్ట్‌ఫోన్ 7000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 6.8 అంగుళాల HD+ IPS Punch Hole స్క్రీన్, 4GB RAM / 128GB ROM, 13MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.7,999 లభిస్తోంది.
Vivo Y02t
రూ.10 వేల లోపు బెస్ట్ వివో ఫోన్‌ను కోరుకునే వారు Vivo Y02t పరిశీలించవచ్చు. ఇది 44% రాయితీతో రూ.8,999లకు అమెజాన్‌లో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.51 అంగుళాల HD+ స్క్రీన్, 4GB RAM + 64GB ROM, 5000mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది.
TECNO Spark 9
TECNO Spark 9 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ.6,999 అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.6 HD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్, 13MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఇందులో ఫీచర్లుగా ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!