• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రభాస్ ఎపిసోడ్.. మరో ప్రోమో

    డిసెంబరు 30న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ప్రభాస్ ఎపిసోడ్‌కి సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. ఇందులో ప్రభాస్ మాయలో పడిపోయా అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఒకే హీరోయిన్ గురించి ప్రభాస్, గోపీచంద్ గొడవపడటం, పెళ్లి గురించి బాలయ్య ఆరా తీయడం.. తెలివిగా ప్రభాస్ తప్పించుకోవడం చూసి ప్రేక్షకులు సంబర పడిపోతున్నారు. చివర్లో బాలయ్య రామ్‌చరణ్‌కి ఫోన్ చేసి.. ‘సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. ఆ తర్వాతే నాన్నగారి సినిమా చూడు’ అని చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతోంది.

    బాలయ్య షోలో జయప్రద, జయసుధ, రాశీఖన్నా

    బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్2’ షోకి అలనాటి నటీమణులు జయప్రద, జయసుధ అతిథులుగా వచ్చారు. వీరితో పాటు యువ నటి రాశీ ఖన్నా కూడా వచ్చింది. ఈ క్రమంలో రాశిఖన్నాతో బాలయ్య పాట పాడించారు. రాశీ నవ్వుకి పడిపోయానంటూ చమత్కరించారు. అనంతరం కొన్ని సున్నితమైన ప్రశ్నలు అడిగారు. ‘హీరోయిన్ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాలా?’ అన్న ప్రశ్నకు ముగ్గురూ ‘ఊ’ అన్నారు. అలాగే ప్రస్తుతం ‘నేనూ, శ్రుతిహాసన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ పెయిర్’ అంటూ వారిని కవ్వించారు. ఈ ఎపిసోడ్ రేపు ఆహాలో … Read more

    గోపీచంద్‌ని ఆటపట్టించిన ప్రభాస్

    బాలయ్య అన్‌స్టాపబుల్ షో సీజన్ 2 లో ప్రభాస్-గోపీచంద్ ఎపిసోడ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆహా గోపీచంద్‌కి చెందిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో గోపీచంద్ సరదాగా కనిపించారు. ‘2008లో కాదు సర్..’ అని గోపీచంద్ అంటుంటే.. ‘రేయ్..’ అని ప్రభాస్ అనడంతో నవ్వులు పూచాయి. అనంతరం గోపీ‌చంద్‌ని ప్రభాస్ ఆటపట్టిస్తుంటే బాలయ్య మధ్యలో నిలుచుండటం వంటివాటితో గ్లింప్స్ సరదాగా సాగిపోయింది. వీక్షకులను ఆకట్టుకుంటున్న ఈ గ్లింప్స్‌కు సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు.

    ప్రభాస్, Nbk వీడియో గ్లింప్స్

    అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్, బాలయ్య unstoppable ఎపిసోడ్ కు సంబంధించి గ్లింప్స్ వచ్చేసింది. ప్రభాస్ క్యూట్ లుక్ లో అదిరిపోయాడు. ఏం చెబుతున్నవ్ డార్లింగ్ అంటూ ప్రభాస్ మాట్లాడటం గ్లింప్స్ కే హైలైట్ గా అనిపించింది.

    బాలయ్య…మజాకా !

    అన్‌స్టాపబుల్‌ సిరీస్‌తో బాలకృష్ణ దుమ్ములేపుతున్నారు. తన షోకు వచ్చిన వారిని సరదా ప్రశ్నలతో ఆటపట్టిస్తున్నారు. ఈసారి హీరోలు శర్వానంద్‌, అడవి శేష్‌లు రాగా వారితో ఓ ఆట ఆడుకున్నారు. రష్మిక తన క్రష్‌ అని ఓ ఎపిసోడ్‌లో చెప్పటంతో..శర్వా ఆమెతో వీడియో కాల్‌ మాట్లాడించారు. డబుల్‌ మీనింగ్‌ జోకులు వేసి కవర్‌ చేసేందుకు ప్రయత్నించిన శర్వానంద్‌కు. ఇవన్నీ బీ సెంటర్‌ తెలివితేటలంటూ చుక్కలు చూపించారు. ఇలాంటి ఎన్నో సరాదా సంభాషణలతో రిలీజ్‌ చేసిన [ప్రోమో](url) ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

    ఓటీటీలోకి అనిల్‌ రావిపూడి

    టాలీవుడ్‌లో వరుస హిట్లు అందుకుంటున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓటీటీల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్న కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించున్నారు. కామెడీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పేరుతో వస్తున్న ఈ షోను ఎస్‌ఓఎల్‌ సంస్థ నిర్మించింది. దీనిని నవంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేేస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించే అనిల్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి. View this post on Instagram A post shared by ahavideoin … Read more

    ఎమోషనల్‌గా ‘UnStoppable2’ ప్రోమో

    ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో అదరగొడుతోంది. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలను బాలయ్య తెలుసుకున్నాడు. ఈ ట్రైలర్ భావోద్వేగంగా సాగుతుంటుంది. ‘మొహంపై మొటిమలు పెట్టుకుని హీరో ఎలా అవుతావ్?’ అని సిద్ధును అవమానించారట. సినిమా చేస్తున్న సమయంలో తన సోదరి ఆసుపత్రి పాలైందని తెలిసి మానిటర్ వెనకాల వెక్కివెక్కి ఏడ్చానని విశ్వక్‌సేన్ గుర్తుచేసుకున్నాడు.

    ‘థ్యాంక్యూ’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

    నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ‘థ్యాంక్యూ’ మూవీ ఆశించ‌న ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. జులై 22న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ‌ప‌రిచింది. అయితే తాజాగా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 11నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో థ్యాంక్యూ స్ట్రీమింగ్ కానుంది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రాశిఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అవిగా గోర్, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

    ‘హ‌లో వ‌ర‌ల్డ్’ వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ రిలీజ్

    జీ5 ఓటీటీ ఒరిజిన‌ల్స్ వెబ్‌సిరీస్ ‘హలో వ‌రల్డ్’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ దీన్ని లాంచ్ చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగాల్లో ఉన్న క‌ష్టాలు, ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాలు జాబ్‌తో ఎలా ముడిప‌డి ఉంటాయో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. శివ‌సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. న‌టి స‌దా చాలాకాలం త‌ర్వాత ఈ వెబ్‌సిరీస్‌తో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. ఆర్య‌న్ రాజేశ్ కూడా ఇందులో న‌టిస్తుండ‌టం విశేషం. నిహారిక కొణిదెల ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన … Read more

    కాఫీ విత్ క‌ర‌ణ్‌లో అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్

    ‘కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7’ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎప్ప‌టిలాగే కాంట్ర‌వ‌ర్సీలు, కామెంట్స్‌తో షోకి రావాల్సిన హైప్ వ‌చ్చింది. త‌ర్వాత‌ ఎపిసోడ్‌లో ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ చిత్ర‌బృందం అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ కాఫీ విత్ క‌ర‌ణ్‌లో పాల్గొంటున్నారు. అమీర్ ఖాన్‌కు ఫ్యాష‌న్ గురించి అస‌లు తెలియ‌దు అంటూ క‌రీనా క‌పూర్ ఆట ప‌ట్టిస్తుంది. అదేవిధంగా అక్ష‌య‌ర్ కుమార్ 30 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తే నువ్వు 200 రోజులు తీసుకుంటావు అని చెప్తుంది. అది చూసి క‌ర‌ణ్ జోహార్ న‌వ్వుకుంటున్నాడు. ఈ ఎపిసోడ్ గురువారం … Read more