నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు: టీజీ కీర్తి కుమార్
సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ కెవిన్ ఎ
ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్
నిర్మాత: అదితి సోని
వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్ కె. సింగ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్ స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
వెన్నెల కిషోర్ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్ లైన్ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్ అయ్యింది. ఏజెంట్ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్‌ను కూడా డైరెక్టర్ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది.
టెక్నికల్‌గా
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
- వెన్నెల కిషోర్ నటన
- కామెడీ
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- స్లో నారేషన్
- రక్తి కట్టించే సీన్లు లేకపోవడం
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!