‘సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం సృష్టిస్తోంది. ఓ రేంజ్‌లో పరువాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను కంగు తినేలా చేస్తోంది.
తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్ కుర్రకారులో మరింత వేడిని పెంచుతోంది. క్రీమ్ కలర్ మల్బరీ బ్లౌజ్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.
మల్బరీ పట్టు చీరను కేరళ స్టైల్‌లో ధరించి అందాల విందు చేసింది. మత్తెక్కించే చూపులతో గాలం వేస్తోంది
లూజ్ హెయిర్, గొల్డెన్ జూకాలు, నోస్ రింగ్ ఆమె అందాన్ని మరింత ఆకర్శనీయం చేశాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం అందం రా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
సప్త సాగరాలు (Sapta Sagaralu Dhaati (Side B) చిత్రంలో లిప్‌లాక్ సీన్లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ వేసినా అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు.
మహిరా (Mahira 2019) అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ… తక్కువ కాలంలో మల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి పాడేటప్పుడు ఇంట్లో సంగీతం వింటూ పెరిగింది, అలా ఆమె పాడటంపై ఆసక్తిని పెంచుకుని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది.
సంగీతం అంటే ఇష్టంతో సింగర్‌గా వచ్చిన చైత్ర అనుకోకుండా నటిగా మారింది. ఇప్పటికే నేపథ్య గాయనిగా 10కి పైగా పాటలు పాడింది.
గరుడ గమన వృషభ వాహన సినిమాలో “సోజుగడ సూజుమల్లిగే” పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సైమా అవార్డును పొందింది.
కళాశాలలో ఉండగానే, నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి, నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సప్త సాగరాలు దాటి సైడ్ బి చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఈ చిత్రంలో వేశ్యగా నటించి మెప్పించింది. టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ పల్లెటూరు కూతురిగా అందరినీ అలరించింది. ప్రస్తుతం స్ట్రాబెర్రి, జన్మదిన శుభాకాంక్షలు వంటి కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.