• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • CMF Watch Pro: నథింగ్‌ సబ్‌ బ్రాండ్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌ వాచ్‌.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!

    మార్కెట్‌లో నథింగ్‌ (Nothing) ఫోన్లకు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నథింగ్‌ సబ్‌ బ్రాండ్‌ అయిన CMF భారత్‌లో సరికొత్త వాచ్‌ను తాజాగా లాంఛ్‌ చేసింది. CMF Watch Pro పేరుతో దీన్ని భారతీయులకు పరిచయం చేసింది. మరో రెండ్రోజుల్లో (సెప్టెంబర్‌ 30) ఈ వాచ్‌ సేల్స్‌ మెుదలుకానున్నాయి. టెక్‌ ప్రియులను ఆకర్షించే ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వాచ్‌ రిలీజ్‌ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఇది యూజర్ల అంచనాలను కచ్చితంగా అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో CMF Watch Pro ఫీచర్లు ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    వాచ్‌ స్క్రీన్‌

    CMF Watch Proను 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. దీనికి 58Hz రిఫ్రేష్‌ రేట్‌, 600 nits పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించారు. 

    స్పోర్ట్స్‌ మోడ్స్

    CMF Watch Pro.. 110 స్పోర్ట్స్‌ మోడ్‌ను కలిగి ఉంది. ఈ వాచ్‌ మానీటర్‌ ద్వారా మీ బాడీలోని ఆక్సిజన్‌ లెవెల్స్‌, స్లీప్‌ సైకిల్స్‌, స్ట్రెస్‌ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు.

     

    కనెక్టివిటీ

    ఈ వాచ్‌ Bluetooth 5.3 బ్లూటూత్‌ కెనెక్టివిటీని కలిగి ఉంది. వాతావరణం అప్‌డేట్స్‌ (Weather updates), రిమోట్‌ కంట్రోల్‌ (Remote control), బ్లూటూత్‌ కాలింగ్‌ (BT calling), వాయిస్‌ అసిస్టెన్స్‌ (voice assistant) ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    బ్యాటరీ లైఫ్‌

    సీఎంఎఫ్‌ వాచ్‌ ప్రోకు 340mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 13 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది. 

    వాటర్ రెసిస్టెన్స్‌

    నీటిని తట్టుకునేలా సామర్థ్యాన్ని CMF Watch Proకు అందించినట్లు లాంఛ్ ఈవెంట్‌లో కంపెనీ పేర్కొంది. డస్ట్‌, వాటర్‌ను నిరోధించే IP68 ratingను వాచ్‌కు ఇచ్చినట్లు తెలిపింది. 

    వాచ్‌ కలర్స్‌

    సీఎంఎఫ్‌ వాచ్‌ ప్రోను రెండు కలర్‌ వేరియంట్లలో కంపెనీ తీసుకొస్తోంది. మెటాలిక్‌ గ్రే (Metallic Grey), డార్క్‌ గ్రే (Dark Grey) కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    CMF Watch Pro ధరను రూ. 4,999గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్‌ సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. Axis Bank కార్డ్స్‌ ద్వారా కొనుగోలు చేస్తే 5% వరకూ రాయితీ పొందవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv