విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి సమీక్షిద్దాం.
కథ:
విక్రమ్ ఈ మూవీలో ‘మది’ అనే ఒక మ్యాథ్స్ టీచర్. కొన్ని సంఘటనల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ తీవ్రమైన నేరాలు చేస్తుంటాడు. అంతర్జాతీయ స్థాయిలో మది కొన్ని హత్యలు చేస్తాడు. మరో వైపు భావన (శ్రీనిధి శెట్టి) మదిని ప్రేమిస్తూ ఉంటుంది. పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తర్వాత.. ఖదీర్ (మరో విక్రమ్), మది పై పగ బట్టి అతన్ని అంతం చేయడానికి ప్రణాళికలు చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఈ ఖదీర్ ఎవరు ?, ఎందుకు మది పై పగ బట్టాడు ?, వీరి మధ్య జరిగిన కథ ఏమిటి ?అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
కథలో కొత్తదనం కనిపిస్తుంది. విక్రమ్.. మది, ఖదీర్ పాత్రల్లో జీవించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో ఆయన వేసిన గెటప్‌లు చాలా ఆకట్టుకుంటాయి. కొన్ని ఎమోషనల్ సీన్లలో విక్రమ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇక హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి తమ పరిధిమేరకు నటించారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బాగా నటించారు. అయితే సినిమాలో ఆయన రోల్ అంత బలంగా కనిపించదు. కె.ఎస్.రవికుమార్, ఆనంద్‌రాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం ఉన్నా ప్రేక్షకుడు కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంది. థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఆద్యంతం ఉత్కంఠ రేపే విధంగా కథ సాగాలి. కాని అలా సాగలేదు. ఫస్టాఫ్‌లో గెటప్‌లతో ఆకట్టుకున్న విక్రమ్‌కు సెకండాఫ్‌లో నటనకు అంత ఆస్కారం లభించలేదు. విలన్ క్యారెక్టర్ చేసిన రిషి పాత్రని తొలుత భయంకరంగా చూపించినా, క్లైమాక్స్ సీన్లలో తేలిపోయింది. కొన్ని సీన్లు మరి సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఖదీర్ పాత్రను హైలెట్ చేయడానికి మది పాత్రను తగ్గించడం బాగాలేదు. మది క్యారెక్టర్ యాక్టివిటీస్ సినిమాకి మైనస్ అయ్యాయి. చివరి వరకు కథను థ్రిల్లింగ్‌గా నడిపే క్రమంలో డైరెక్టర్ జ్ఞాన ముత్తు లాజిక్ మిస్సయ్యారు.
సాంకేతికంగా ఉన్నతం
సాంకేతికంగా తీసుకుంటే సినిమా చాలా పైస్థాయిలో ఉంది. అన్ని సన్నివేశాలు చాలా రిచ్ ప్రజెంట్‌ను కలిగిస్తాయి. కెమెరా పనితనం బాగుంది. సాంగ్స్ చీత్రికరణ, రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచింది.
చివరగా:
కోబ్రా మూవీ విక్రమ్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది