ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల వాక్యూమ్ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధునాతనమైనవి ‘కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్లు’ (Cordless Vacuum cleaners). ఇవి స్టిక్ మాదిరిగా ఉండి ఇంటిలోని ప్రతీ మూలను కవర్ చేస్తాయి. దీని సాయంతో అన్నిరకాల ఫ్లోర్లతో పాటు ఫర్నిచర్, సోఫాసెట్, రగ్గులు, తివాచీలు, ఫాబ్రిక్ మెుదలైన వాటిని శుభ్రం చేయవచ్చు. ఇవి నిటారుగా ఉండటం వల్ల వంగి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం అమెజాన్‌లో వివిధ కంపెనీలకు చెందిన Cordless vacuum cleaners లభిస్తున్నాయి. వాటిలో టాప్-6 జాబితాను YouSay మీ ముందుకు తెచ్చింది. అవేంటో ఓ లుక్కేయండి.
1. Dyson V8 Absolute Cord-Free Vacuum Cleaner
అమెజాన్‌లో లభిస్తున్న కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్స్‌లో ‘Dyson V8 Absolute Cord Free’ అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. ఇది 65W డైసన్ డిజిటల్ మోటర్ V8తో పనిచేస్తుంది. 115 AW Suction, 0.54 లీటర్ బిన్ వాల్యూమ్, 5 గంటల రన్ టైమ్‌ను ఈ వాక్యూమ్ క్లీనర్ కలిగి ఉంది. ఇది 99.97% మేర డస్ట్‌ను క్లీన్ చేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పెంపుడు జంతువుల నుంచి వచ్చి పడే వెంట్రుకలను సైతం ఇది అలవొకగా తొలగిస్తుంది. దీని ధర రూ.30,700.
2. Dyson V12 Detect Slim Total Clean
డైసన్ (Dyson) కంపెనీకి చెందిన Dyson V12 Detect Slim Total Clean వాక్యూమ్ క్లీనర్‌కు సైతం మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. ఇది కంటికి కనిపించని డస్ట్ లేదా క్రిములు, బాక్టీరియాలు, క్రిమికీటకాలను సైతం మైక్రోస్కోపిక్ లేజర్ టెక్నాలజీ ద్వారా తొలగిస్తుంది. ఇది 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇది నేలపై ఉన్న పొడవాటి హెయిర్‌తో పాటు, పెట్ హెయిర్‌ను కూడా వేగంగా తొలగిస్తుంది. దీనికి ఫిక్స్ చేసిన LCD స్క్రీన్ ద్వారా దీని పనితనాన్ని ఎప్పటికప్పుడు స్టేటస్ రూపంలో తెలుసుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ 0.35 లీటర్ డస్ట్ బ్యాగ్‌ను కలిగి ఉంది. అమెజాన్‌లో ఇది రూ.52,899 లభిస్తోంది.
3. Tineco Cord-Free Vacuum Cleaner
ఈ వాక్యూమ్ క్లీనర్ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. ఇది సాఫ్ట్, హార్డ్ ఇలా ఏ ఫ్లోర్‌నైనా నిమిషాల్లో శుభ్రం చేసేస్తుంది. దీని సాయంతో సోఫాసెట్ మూలలను కూడా శుభ్రం చేయవచ్చు. అలాగే టేబుల్స్, ఫర్నిచర్, ఇంట్లోని మూలలను కూడా దీని ద్వారా ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్‌కు ఫిక్స్ చేసిన డిజిటల్ స్క్రీన్ ఎప్పటికప్పుడు దీని వర్క్ స్టేటస్‌ను గమనించవచ్చు. దీని అసలు ధర రూ.69,900. కానీ, అమెజాన్ దీనిపై 57% డిస్కౌంట్ ప్రకటించింది. దీని వల్ల ఇది రూ.29,900 లభిస్తోంది.
4. Eureka Forbes Sure Cordless Pro
ఈ వాక్యూమ్ క్లీనర్ కూడా ఎక్కువగా సేల్ అవుతూ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. తక్కువ బడ్జెట్‌లో కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్‌ను కోరుకునే వారు దీన్ని ట్రై చేయవచ్చు. అమెజాన్‌లో ఇది రూ. 14,999 అందుబాటులో ఉంది. దీని ద్వారా గోడపై ఉన్న మరకలు, దుమ్ము, దూళిని సైతం తొలగించవచ్చు.
5. proscenic P11 Cordless Vacuum
ఈ వాక్యూమ్ క్లీనర్ 450W powerful brushless motorతో వర్క్ చేస్తుంది. ఇది హార్డ్ ఫ్లోర్, కార్పెట్, పెట్ హెయిర్ అనే మూడు క్లీనింగ్ మోడ్స్‌ను కలిగి ఉంది. దీనికి అందించిన టచ్ స్క్రీన్ ద్వారా మీకు కావాల్సిన క్లీనింగ్ మోడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. దీని అసలు ధర రూ. 29,990 కాగా అమెజాన్ దీనిపై 17 శాతం రాయితీ ప్రకటించింది. ఫలితంగా ఈ కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ రూ.24,990కే లభిస్తోంది.
6. Philips SpeedPro Cordless Vacuum Cleaner
పిలిప్స్ (Philips) కంపెనీకి భారత్‌లో మంచి మార్కెట్ ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన Philips SpeedPro Cordless Vacuum Cleaner కూడా మంచి డిమాండ్ కలిగి ఉంది. దీనికి 40 నిమిషాల రన్‌టైమ్‌ను అందించారు. ఈ వాక్యూమ్ క్లీనర్‌కు ఫిక్స్ చేసిన LED లైట్స్ ద్వారా ఫ్లోర్‌పై ఉన్న డస్ట్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఫర్నిచర్, కూర్చీలు, డైనింగ్ టేబుల్ కింద ఉన్న దుమ్ము, దూళిని ఈజీగా గుర్తించి క్లీన్ చేయవచ్చు. దీని అసలు ధర రూ. 34,995. అమెజాన్ దీనిపై 14 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ వాక్యూమ్ క్లీనర్‌ను రూ.29,999 దక్కించుకోవచ్చు.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!