‘అవెంజర్స్’ సిరీస్ లాంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన రస్సో బ్రదర్స్, గ్రాఫిక్స్ మాయాజాలం నుంచి బయటికి వచ్చి తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’ హాలీవుడ్ సినిమా లవర్స్ మాత్రమే కాకుండా అందరినీ ఆకర్షించే అంశం ధనుష్. మరి సినిమా ఎలా ఉంది? రస్సో బ్రదర్స్ ఎంత మేరకు విజయం సాధించారు? ఇప్పుడు చూద్దాం.
కథేంటి? ఎలా ఉంది?
ఎంతో కాలం జైలు జీవితాన్ని అనుభవించిన ‘సిక్స్’ను(రేయాన్ గాస్లింగ్) సీఐఏ ఏజెంట్ గా తీసుకుని సియార్రా సిక్స్ గా పేరు పెడతారు. ఓ సీక్రెట్ మిషన్ కోసం అతడిని పంపుతారు ఈ క్రమంలో అతడికి సియర్రాకు సంబంధించిన చీకటి రహస్యాలతో కూడిన ఓ పెన్ డ్రైవ్ దొరుకుంది. అది తీసుకుని అతడు పారిపోతాడు. అతన్ని పట్టుకునేందుకు మరో సీఐఏ ఏజెంట్ సియర్రా ఫోర్(క్రిస్ ఇవాన్స్) ను పంపుతారు. సియర్రా సిక్స్ దొరికాడా? ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న చీకటి రహస్యాలు ఏంటన్నదే కథ. కథ మొత్తం ‘సిక్స్’ చుట్టే తిరుగుతుంది. అతడిని పట్టుకునేందుకు విలన్ ప్రయత్నించడం, అతడు తప్పించుకోవడం దాదాపుగా ఇలాగే సాగుతుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ రుస్సో బ్రదర్స్ నుంచి ప్రేక్షకుడు ఆశించిన స్థాయిలో సినిమా సాగలేదు. సినిమా కథనం మనకు ఇటీవల కాలంలో చూసిన రెడ్ నోటిస్ లాంటి సినిమాలను గుర్తుచేస్తుంది. కథ, అంతగా ఆకట్టుకోలేకపోయినా సినిమాలో ఉన్న స్టార్ క్యాస్ట్ ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది.
ధనుష్ పాత్ర ఎలా ఉంది?
అవిక్ సేన్ అలియాజ్ ద లోన్ వుల్ఫ్ గా ధనుష్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ పరిధి మేరలో ఆకట్టుకున్నాడు. ధనుష్ కు ఇంకాస్త స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చి ఉంటే ఇండియా ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులను కాస్త ఆకట్టుకునేది.
బలాలు
నటులు,
యాక్షన్ సన్నివేశాలు,
సినిమాటోగ్రఫీ
బీజీఎం
బలహీనతలు
పాత కథ
ఎమోషన్స్ లేకుండా కేవలం యాక్షన్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం
ఒక్కమాటలో
యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు, ధనుష్ అభిమానులు ఈ వారాంతంలో ‘ది గ్రే మ్యాన్’ ఎంజాయ్ చేయొచ్చు