‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.
డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది.
గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.
కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.
బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.
ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.
హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.
డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!