• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • DJ టిల్లు మూవీ రివ్యూ..

    బాల గంగాధర్ తిలక్‌గా ఉన్న పేరును టిల్లుగా మార్చుకుంటాడు సిద్ధు జొన్నలగడ్డ. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. టిల్లుకు మ్యూజిక్ అంటే పిచ్చి. ఎప్పటికైనా సరే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. చిన్న చిన్న పెళ్లిల్లు, పేరంటాలకు DJ ప్లే చేస్తూ ఉంటాడు. అందుకే సిద్ధూని అంతా DJ టిల్లు అని పిలుస్తారు. ఇలా లైఫ్‌ని జాలీగా ఎంజాయ్ చేస్తున్న టిల్లు జీవితంలోకి రాధిక (నేహాశెట్టి) వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా కథ. 

    చెప్పేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా కథను దర్శకుడు విమల్ కృష్ణ తెర మీద చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచే చాలా స్పీడుగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడ కూడా సన్నివేశాలు బోర్ కొట్టవు. అలా అలా సాగిపోతున్న తరుణంలో సింగర్ అయిన రాధికను ఎలాగైనా ప్రేమలో దించాలని టిల్లు ప్రయత్నాలు చేస్తాడు. ఈ తరుణంలోనే రాధిక ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ మర్డర్ కేసు మకిలి టిల్లుకి కూడా అంటుకుంటుంది. అసలు టిల్లు ఆ మర్డర్ చేశాడా? లేదా అనే సస్పెన్స్ తోనే సినిమా సాగుతుంది. 

    ఇక టిల్లుగా సిద్ధు ఇరగదీశాడనే చెప్పుకోవాలి. సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో పాటు అతడి కామెడీ టైమింగ్ సూపర్బ్. తెలంగాణ యాసలో టిల్లు చెప్పిన డైలాగ్స్ సినిమాకే నిలిచాయి. ఇక రాధిక, టిల్లు మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ఓ లెవెల్లో ఉన్నాయి. ఈ సీన్లు యువతకు పెద్ద ఎత్తున నచ్చుతాయనడంలో సందేహం లేదు. 

    ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల విషయానికి వస్తే అతడు ఈ సినిమాకు అందించిన పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇలాంటి చిన్న సినిమాను నిర్మించిందంటే సాహసమనే చెప్పాలి. నిర్మాత నాగవంశీ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అన్ని సీన్లను రిచ్‌గా ప్లాన్ చేశాడు. 

    అసలు ట్విస్ట్ అదే… 

    ఏ సినిమాలోనైనా ట్విస్టులు ఉంటేనే సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది. అదే విధంగా DJ టిల్లు మూవీలో కూడా బోలెడన్ని ట్విస్టులు ఉన్నాయి. అసలు రాధికను లవ్‌లో పడేయాలని చూస్తున్న సిద్ధు హత్య కేసులో ఎందుకు ఇరుక్కుంటాడు. పోలీసాఫీసర్ బ్రహ్మాజీ, ప్రిన్స్‌లు కథలోకి ఎందుకు వస్తారనే ట్విస్టు సినిమాలో పేలిపోయింది. 

    హలేరియస్ కామెడీ… 

    ఇక ఈ సినిమాలో టిల్లు కామెడీ లెవెల్స్ సూపర్బ్. అతడి డైలాగ్స్, మ్యానరిసమ్ నెక్ట్స్ లెవల్ అసలు. ఇక టిల్లు అయోమయంలో పడ్డ సమయంలో వచ్చే కామెడీ సీన్లయితే సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమాలో నేహా శెట్టితో వచ్చే లవ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు ఆకట్టుకుంటాయి. 

    డైరెక్టర్ ప్రతిభ.. 

    ఈ సినిమాను విమల్ కృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. విమల్‌కు ఇది మొదటి సినిమా అయినా కానీ ఎక్కడా తడబడకుండా తాను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పేశాడు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ విమల్ కృష్ణకు ఆఫర్లు క్యూ కడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

    సిద్ధు డబుల్ రోల్… 

    అదేంటి సిద్ధు డబుల్ రోల్ చేయడమేంటని అనుకుంటున్నారా. అతడు డబుల్ రోల్ చేసింది సినిమాలో కాదు. సినిమాలో హీరోగా నటించిన సిద్ధు, తెరవెనుక కూడా కథా రచయితగా పని చేశారు. ఇందులో కూడా సిద్ధు సక్సెస్‌ను చవి చూశారు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన సాయిప్రకాశ్ తన కెమెరా పనితనంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా శ్రీచరణ్ కంపోజ్ చేసిన పాటలు ఏ రేంజ్‌లో పేలాయో మనకు సినిమా విడుదలకు ముందే తెలిసిపోయింది. ఈ సినిమాకు ఎడిటర్‌గా పని చేసిన నవీన్ ఈ సినిమా స్థాయిని పెంచేలా తన పనితనం చూపించాడు. 

    ఓవరాల్‌గా 

    ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే DJ టిల్లు మూవీ చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు మంచి హాయిని అందిస్తుంది. ఈ వారాంతంలో చూసేందుకు DJ టిల్లు Is The Best Option. 

    రేటింగ్ 3.25/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv