ప్రస్తుత రోజుల్లో వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వైర్డ్, వైర్లెస్ బ్లూటూత్ కంటే ఇయర్ బడ్స్పైనే యూత్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని గుర్తించిన టెక్ సంస్థలు స్టైలిష్ లుక్‌తో ఇయర్‌బడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. వివిధ ధరల్లో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈ ఇయర్‌బడ్స్‌ను కొందరు వేలు పోసి కొంటుంటే మరికొందరు తక్కువ బడ్జెట్ ఉన్న వాటి కోసం వెతుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.1000 లోపున్న ప్రముఖ కంపెనీల ఇయర్ బడ్స్ జాబితా మీకోసం..
1. Boat Airdopes 100
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రూ.1000 లోపు ఇయర్‌బడ్స్‌లో ‘Boat Airdopes 100’ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ఫోల్డెబుల్ డిజైన్‌తో వన్ ఇయర్ వారంటీతో వస్తోంది. 10 మీటర్ల రేంజ్, 50 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను కలిగి ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.4,490 కాగా.. అమెజాన్ దీనిపై 78% డిస్కౌంట్ ఇస్తోంది. ఫలితంగా రూ.999కే ఈ ఇయర్‌బడ్స్ పొందవచ్చు.
2. Mivi duopods A25
తక్కువ బడ్జెట్లో లభిస్తోన్న మరో మంచి ఇయర్‌బడ్స్ ‘Mivi Duopods A25’. ఇది 40 గంటల ప్లేటైమ్తో పాటు Ipx4 వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఆకర్షణీయమైన టచ్ కంట్రోల్స్, టైప్-C చార్జింగ్ స్లాట్ దీనికి అందించారు. దీని అసలు ధర రూ.2,999. అమెజాన్‌పై దీనిపై కూడా 73% డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫలితంగా దీన్ని రూ.799కే దక్కించుకోవచ్చు.
3. Noise Air Buds Mini
ఇది కూడా ఏడాది వారంటీతో వస్తోంది. 40 గ్రాముల బరువును కలిగి ఉంది. 10 మీటర్ల రేంజింగ్, 45 గంటల ప్లేబ్యాక్ ముఖ్యమైన ఫీచర్లుగా ఉన్నాయి. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ.2,999 కాగా 70% రాయితీ పోనూ.. రూ.899కే దీనిని పొందవచ్చు.
4. Ptron BassBuds Plus
Ptron BassBuds Plusను కూడా ఏడాది వారంటీతో తీసుకొచ్చారు. 10 మీటర్ల రేంజ్, 12 గంటల ప్లేటైమ్‌ను ఫీచర్లుగా అందించారు. 300 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. Li-Polymerతో బ్యాటరీ తయారైంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,499. కానీ, అమెజాన్ దీనిపై 76% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ ఇయర్‌బడ్స్ కేవలం రూ.599కే అందుబాటులోకి వచ్చాయి.
5. truke Buds S2 Lite
ట్రక్ బడ్స్ ఎస్2 లైట్‌ను 10 మీటర్ల రేంజ్‌తో తీసుకొచ్చారు. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్ దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 300 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. దీని అసలు ధర రూ.2,999. అమెజాన్ 70% రాయితీ ప్రకటించింది. కాబట్టి రూ.899 దీన్ని పొందవచ్చు.
6. Wings Phantom 450
ఈ ఇయర్‌బడ్స్‌ను డిజిటల్ బ్యాటరీ డిస్ప్లేతో తీసుకొచ్చారు. Wings Phantom 450 ఏకంగా 50 గంటల ప్లేటైమ్‌ను కలిగి ఉంది. దీని ఒరిజినల్ కాస్ట్ రూ. 2,799. అమెజాన్ తన వినియోగదారులకు 64% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.999కే అందుబాటులోకి వచ్చింది.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!