• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Fighter Movie Review: శత్రుదేశానికి చుక్కలు చూపించిన హృతిక్‌.. ‘ఫైటర్‌’ ఎలా ఉందంటే?

    నటీనటులు: హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీవ్‌ జైశ్వాల్‌ తదితరులు

    రచన, దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌

    సంగీతం: విశాల్‌ – శేఖర్‌ 

    నేపథ్య సంగీతం: సంచిత్‌ బల్హారా – అంకిత్‌ 

    సినిమాటోగ్రఫీ: సచిత్‌ పాలోస్‌

    ఎడిటింగ్‌: ఆరిఫ్‌ షేక్‌

    విడుదల:  25-01-2024

    బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). బాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ‘వార్‌’ చిత్రం తర్వాత హృతిక్‌ – ఆనంద్‌ కాంబోలో మరోమారు ఈ చిత్రం వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా సిద్దార్థ్‌ ఆనంద్‌ రీసెంట్‌ చిత్రం ‘పఠాన్‌’ సూపర్‌ హిట్ కావడంతో (Fighter Movie Review In Telugu) అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇందులో హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే నటించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హృతిక్‌ చేసిన యాక్షన్ అడ్వెంచర్స్‌ ఆకట్టుకుందా? సిద్దార్థ్‌ ఆనంద్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.

    కథేంటి

    సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనుకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం కూడా ఆ మిషన్‌ కోసం అతడితో పాటు రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? (Fighter Movie Review) పాటీని వెంటాడుతున్న గతం ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ వీరోచిత ఫైట‌ర్‌గా ఎలా నిలిచాడు? అన్నది కథ. 

    ఎవరెలా చేశారంటే

    హృతిక్‌రోషన్‌ (Hrithik Roshan) ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూనే పోరాట ఘట్టాల్లో తన మార్క్‌ ఏంటో చూపించాడు. కళ్లతో భావాల్ని పలికిస్తూ చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలను రగిలించాడు. అటు హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే (Deepika Padukone) చక్కటి నటన కనబరిచింది. ద్వితియార్థంలో తన నటనతో భావోద్వేగాల్ని పండించింది. అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. రాకీ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అక్ష‌య్ ఒబెరాయ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

    భారత వాయుసేన చుట్టూ సాగే కథ ఇది. యాక్ష‌న్‌, నేప‌థ్యం, విజువ‌ల్స్ ప‌రంగా ‘ఫైటర్‌’ (Fighter Movie Review In Telugu) ప‌ర్వాలేదు కానీ క‌థ, క‌థ‌నాల ప‌రంగానే నిరుత్సాహ ప‌రుస్తాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని ద‌ర్శ‌కుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ ప్రేక్షకుల్లో ఏమాత్రం క‌లిగించ‌లేక‌పోయారు. అయితే శ‌త్రుదేశ‌మైన పాక్ ఉగ్రవాదులతో పన్నిన పన్నాగాలను వైమానిక దళం ఎలా ఎదుర్కొందో చూపించిన తీరు బాగుంది. హాలీవుడ్ చిత్రాల్ని త‌ల‌దన్నే రీతిలో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దడంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. వాటికి దేశభక్తిని జోడించడం కలిసొచ్చింది.  కథ, కథనాన్ని పక్కన పెడితే డైరెక్టర్‌గా సిద్ధార్థ్‌ ఆనంద్‌ మరోమారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

    సాంకేతికంగా

    సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. స‌చిత్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా గగనతలంలో వచ్చే యాక్షన్‌ సీన్లను ఆయన అద్భుతంగా చూపించారు. ఇక సంచిత్‌-అంకిత్ నేప‌థ్య సంగీతం, విశాల్-శేఖ‌ర్ పాట‌లు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్న‌తంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.

    ప్లస్‌ పాయింట్స్‌

    • హృతిక్‌, దీపిక, అనిల్‌ కపూర్‌ నటన
    • యాక్షన్‌ సన్నివేశాలు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటిన్‌ స్టోరీ
    • ఊహకందే సన్నివేశాలు 

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv