ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చే వాటిలో డోర్ మ్యాట్స్ (Door Mats) ఒకటి. మీ ఇంటికి లక్షల్లో విలువ చేసే డోర్‌ను ఫిక్స్ చేసినా సరైన డోర్ మ్యాట్ లేకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే చాలా మంది డోర్ మ్యాట్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల డోర్ మ్యాట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ బడ్జెట్లో మంచి డోర్ మ్యాట్స్ ఏవో తెలియక చాలా మంది తెగ సెర్చ్ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఈ కథనం తీసుకొచ్చింది. రూ.500 లోపు ఉన్న అందమైన, నాణ్యత కలిగిన డోర్‌మ్యాట్స్ ఏవో ఒక లుక్కేయండి.
SWHF Natural Coconut Fiber
సాధారణంగా చాలా మంది సహజసిద్ధమైన డోర్‌మ్యాట్స్‌ను వినియోగించేందుకు ఇష్టపడుతుంటారు. అటువంటి వారికి ‘SWHF Natural Coconut Fiber’ మంచి ఛాయిస్. దీన్ని కొబ్బరి పీచుతో మోడ్రన్ లుక్‌తో రూపొందించారు. ఇంటా, బయటా రెండు రకాలుగా ఈ మ్యాట్‌ను ఉపయోగించుకోవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.449కే లభిస్తోంది. 22 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
Waco Creation Rubber Coir
తక్కువ బడ్జెట్లో మంచి రబ్బర్ డోర్ మ్యాట్‌ను కోరుకునేవారు ‘Waco Creation Rubber Coir’ ట్రై చేయవచ్చు. దీని అంచులు, కింది భాగం పూర్తిగా రబ్బర్‌తో తయారైంది. పై మధ్య భాగంలో కొబ్బరి పీచును వినియోగించారు. ఈ డోర్ మ్యాట్ సైజ్ 40 x 60గా ఉంది. అమెజాన్‌లో ఇది రూ.399కే లభిస్తోంది.
Pipro Anti Slip Floor Mat
ఇంటి ముందు మంచి గ్రిప్ ఉన్న డోర్ మ్యాట్ కోరుకునే వారు ‘Pipro Anti Slip Floor Mat’ పరిశీలించవచ్చు. ఇది పాదాలు జారకుండా మంచి గ్రిప్ అందిస్తుంది. Polypropyleneతో ఈ మ్యాట్‌ను తయారు చేశారు. 60 x 40 CM సైజ్, 1200 గ్రాముల బరువును కలిగి ఉంది. అమెజాన్‌లో దీని ప్రైస్ రూ.349.
NatFit60 Polypropylene
ఈ డోర్ మ్యాట్ కూడా మీ పాదాలకు మంచి గ్రిప్‌ను అందిస్తుంది. మీ గుమ్మానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. దీన్ని కూడా Polypropylene మెటీరియల్‌తో తయారు చేశారు. అంచులతో పాటు మ్యాట్ అడుగుభాగాన్ని రబ్బర్‌తో రూపొందించారు. దీన్ని తేలిగ్గా చేతులతోనే వాష్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీని వెల రూ.399గా ఉంది.
amazelo cart
రూ.500 లోపు మార్కెట్‌లో లభిస్తోన్న మరో మంచి డోర్ మ్యాట్ ‘amazelo cart’. ఇది క్వాలిటీతో రావడంతో పాటు మీ ఇంటికి రిచ్ లుక్‌ను తీసుకొస్తుంది. బయట నుంచి వచ్చే వారు తమ పాదాలను ఈ మ్యాట్‌కు తుడవడం ద్వారా తేలిగ్గా దుమ్ము, దూళిని వదిలించుకోవచ్చు. దీని అసలు ధర 1,399 కాగా.. అమెజాన్‌లో ఇది 71 శాతం రాయితీతో లభిస్తోంది. ఫలితంగా దీన్ని రూ.399కే పొందవచ్చు.
HOKIPO Antislip Rubber
ఇంటి ముందు స్టైలిష్ డోర్ మ్యాట్ కోరుకునే వారు ‘HOKIPO Anti Slip Rubber‘ ట్రై చేయవచ్చు. లుకింగ్ పరంగా దీనిని బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ మ్యాట్ మంచి గ్రిప్ కలిగి ఉంది. అమెజాన్‌లో ప్రైస్ రూ.499గా ఉంది.
Onlymat Natural Coir Leaf
ఇంటి ముందు కలర్‌ఫుల్ డోర్ మ్యాట్ కావాలనుకునేవారికి Onlymat Natural Coir Leaf చక్కటి ఆప్షన్. ఇది ఎండకు, వానకు తట్టుకొని మరి మంచి పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. దీన్ని కొబ్బరి పీచుతో చాలా అందంగా రూపొందించారు. అమెజాన్‌లో ఈ మ్యాట్ ధర రూ. 399గా ఉంది.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!