ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) అద్భుతమైన ల్యాప్‌టాప్‌లను సైతం రిలీజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కొత్తగా ప్రీమియం ల్యాప్‌టాప్స్‌ను తీసుకొచ్చేందుకు శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. ‘Samsung Galaxy Book 4 Series’ పేరుతో అడ్వాన్స్‌డ్ ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. అయితే తాజాగా ఈ ల్యాప్‌టాప్స్‌కు సంబంధించిన సమాచారం నెట్టింట ప్రత్యక్షమయ్యింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ల్యాప్‌టాప్ వేరియంట్లు
శాంసంగ్ మెుత్తం ఐదు వేరియంట్లలో కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Galaxy Book 4, Galaxy Book 4 360, Galaxy Book 4 Pro 360, Galaxy Book 4 Pro, Galaxy Book 4 Ultra వేరియంట్లలో ఇవి మార్కెట్‌లోకి రానున్నాయి.
ఇంటెల్ ప్రొసెసర్
నయా శాంసంగ్ ల్యాప్‌టాప్స్ పవర్‌ఫుల్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్‌తో రానున్నాయి. Galaxy Book 4 ల్యాప్‌టాప్ Intel Core 5 120U ప్రొసెసర్‌తో వర్క్ చేయనుంది. అలాగే Galaxy Book 4 360 ల్యాప్‌టాప్ Intel Core 5 120Uతో, Galaxy Book 4 Pro 360 ల్యాప్‌టాప్ Intel Core Ultra 7 155Uతో, Galaxy Book 4 Pro ల్యాప్‌టాప్ Intel Core Ultra 7 155Uతో, Galaxy Book 4 Ultra ల్యాప్‌టాప్ Intel Core Ultra 9 185H ప్రొసెసర్‌తో పని చేయనున్నాయి.
ఆపరేటింగ్ సిస్టమ్
బుక్ 4 సిరీస్ ల్యాప్‌టాప్స్ అన్ని విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనున్నాయి. ఇవి డాల్బీ అట్మాస్ స్పీకర్స్, డిజిటల్ మైక్, టైప్-C అడాప్టర్, ఇంటెల్ గ్రాఫిక్స్, Bluetooth v5.1, Wi-Fi 6802.11 ax కెనెక్టివిటీ ఫీచర్లతో రానున్నాయి.
టచ్ స్క్రీన్
Galaxy Book 4 ల్యాప్‌టాప్స్ అన్ని టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తాయని లీకైన సమాచారం చెబుతోంది. Galaxy Book 4 ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల FHD LED స్క్రీన్‌తో వస్తుండగా.. Galaxy Book 4 360 ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల AMOLED స్క్రీన్, Pro 360 ల్యాప్‌టాప్ 14 అంగుళాల AMOLED డిస్‌ప్లే, Pro ల్యాప్‌టాప్ 14 అంగుళాల AMOLED స్క్రీన్, Ultra ల్యాప్‌టాప్ 16 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది.
ర్యామ్ & స్టోరేజ్
Galaxy Book 4, Galaxy Book 4 360 ల్యాప్‌టాప్స్ 8GB RAMతో రానున్నాయి. అలాగే Pro 360, Pro ల్యాప్‌టాప్స్ 12GB RAMతో వస్తాయి. గెలాక్సీ బుక్ 4 అల్ట్రా ల్యాప్‌టాప్ 32GB RAMతో పనిచేయనుంది. 265GB, 512GB, 1TB ఆప్షన్స్‌లో స్టోరేజ్ వేరియంట్లను కలిగి ఉన్నాయి.
లాంచ్ ఎప్పుడంటే?
త్వరలో శాంసంగ్ నిర్వహించబోయే ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్’ (Galaxy Unpacked event)లో Galaxy Book 4 సిరీస్‌ను లాంచ్ చేసే అవకాశముంది. ఆ రోజే ధరతో సహా ఇతర ఫీచర్లకు సంబంధించిన వివరాలను శాంసంగ్ ప్రకటించనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!