టెక్ కంపెనీలు ప్రతీ సంవత్సరం కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తుంటాయి. భారీగా ప్రమోషన్ చేసి వాటిపై కస్టమర్లకు ఆసక్తిని పెంచుతుంటాయి. ఇందుకోసం యాపిల్, గూగుల్, శామ్‌సంగ్ కంపెనీలు ఏటా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే బుధవారం (జులై 26) శామ్‌సంగ్ కంపెనీ.. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ (Galaxy Unpacked Event) నిర్వహించనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రొడక్ట్స్‌ను కంపెనీ పరిచయం చేయనుంది.
లాంచ్ అయ్యే ప్రొడక్ట్స్ ఇవే
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీవలే శామ్‌సంగ్ రిలీజ్ చేసింది. ఇందులో ఫోల్డబుల్ సిరీస్ ఫోన్ల కొత్త డిజైన్‌ను రివీల్ చేసింది. కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Galaxy Z Fold 5), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Galaxy Z Flip 5) మోడళ్లను ఈ మెగా ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. అలాగే గెలాక్సీ వాచ్ 6 (Galaxy Watch 6) సిరీస్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో కర్వ్డ్ గ్లాస్, అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ ఉండవచ్చు. కంపెనీ ఇదే ప్రోగ్రామ్‌లో గెలాక్సీ ట్యాబ్ ఎస్9 (Galaxy Tab S9) సిరీస్‌ను సైతం ఆవిష్కరించనుంది.
అందరి దృష్టి వాటిపైనే!
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ దక్షిణ కొరియాలో జరగనుంది. భారత కాలమనం ప్రకారం రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ ప్రారంభమవుతుంది. శామ్‌సంగ్ మొదటిసారి తమ స్వదేశంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించడం విశేషం. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఆసక్తిగల వారు ఆయా వేదికల ద్వారా గెలాక్సీ అన్‌పాక్డ్ ఈవెంట్‌ను వీక్షించవచ్చని శామ్‌సంగ్ వర్గాలు సూచించాయి. ఇదిలా ఉంటే ఈవెంట్‌లో లాంచ్ చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Galaxy Z Fold 5), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 (Galaxy Z Flip 5) మోడళ్లపై అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Galaxy Z Fold 5
‘శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5’ ఫోన్ ఫీచర్లు అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో రావచ్చని లీక్ అయిన డేటా చెబుతోంది. 7.6 అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, 6.2 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లేతో ఫోన్ లాంచ్ కానున్నట్లు సమాచారం. 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరా, 50MP ప్రైమరీ సెన్సార్ సెటప్‌తో ఈ ఫోన్ రానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, పూర్తి వివరాలు తెలియాలంటే రేపు సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Galaxy Z Flip 5
శామ్‌సంగ్ Z ఫ్లిప్ 5 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు సైతం అధికారికంగా బయటకు రాలేదు. కానీ లీకైన సమాచారం ప్రకారం.. ఇది 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో, అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో ఇది మంచి పనితీరును అందించనుంది. ఈ డివైజ్ డ్యుయల్ 12 MP కెమెరా సెటప్‌తో రానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ IP58 రేటింగ్‌తో రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!