• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: RRR తరహాలో ‘గేమ్‌ ఛేంజర్‌’.. గుంపుతో మళ్లీ ఫైట్‌ చేయనున్న చరణ్‌? 

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ త్వరలో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. దీని ద్వారా మేకర్స్ ఓ విషయాన్ని చెప్పకనే చెప్పారని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. 

    గుంపుతో చరణ్‌ ఫైట్‌

    RRR చిత్రంలోని రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ఎప్పటికీ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వందలాది మంది నిరసన కారులతో చరణ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అయితే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోనూ ఈ తరహా మాబ్‌ ఫైట్‌ను (Mob Fight) ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఇదే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. సినిమా రిలీజ్‌కు 75 రోజులు ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్‌ త్వరలో రానున్నట్లు ఇందులో హింట్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌ను గమనిస్తే చరణ్‌ ముందు టేబుల్ వేసుకొని కుర్చీలో కూర్చునట్లుగా వెనకనుంచి చూపించారు. అదే సమయంలో పదుల సంఖ్యల గుండాలు కత్తులు, కర్రలతో చరణ్‌ వైపు దూసుకురావడం చూపించారు. దీన్ని బట్టి RRR తరహాలో మాబ్‌ ఫైట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేయోచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. 

    కలిసొచ్చిన మాబ్‌ ఫైట్‌

    మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు వందలాది మంది రౌడీలతో చేసే మాబ్‌ ఫైట్‌ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో చరణ్‌ తొలిసారి మాబ్ ఫైట్‌ చేశారు. ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ ఖాన్‌ 100 మందిని ఒకేసారి పంపించు’ శత్రు సైన్యంతో విరోచితంగా పోరాడాడు. ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించిన ధ్రువ సినిమాలోనూ ఈ తరహా సీన్‌ను చూడవచ్చు. తనపైకి దూసుకొచ్చిన అల్లరిమూకకు బుద్ధి చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ‘RRR’లో చేసిన మాబ్‌ ఫైట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చరణ్‌ గుంపుతో ఫైట్‌ చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ ఇలాంటి ఫైట్‌ ఉంటే ఆ మూవీ కూడా పక్కాగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. 

    దీపావళికి టీజర్‌ రిలీజ్‌!

    రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్‌’ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. మరో హీరోయిన్‌ అంజలి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, సునీల్, శ్రీకాంత్‌, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్‌, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, కన్నడ నటుడు జ‌య‌రామ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైమ్ ఫిక్స్ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో మెగా ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 

    రూ.150 కోట్లకు తెలుగు రైట్స్‌?

    ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.150 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. ఆంధ్రా నుంచి రూ. 70 కోట్లు, సీడెడ్ నుంచి రూ.25 కోట్లు, నైజాం ఏరియా నుంచి రూ. 55 కోట్ల మేర బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి. ‘గేమ్‌ఛేంజర్‌’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పుడు ఇంత బిజినెస్ జరిగే అవకాశం కనిపించలేదట. అయితే ఈ మూవీ రిలీజ్ సంక్రాంతికి వాయిదా పడటంతో బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోయినట్లు ఫిల్మ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

    రికార్డు ధరకు ఓటీటీ హక్కులు!

    గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు సైతం రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌కు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv