• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • GOD MOVIE REVIEW TELUGU: సైకో థ్రిల్లర్‌గా వచ్చిన గాఢ్ మెప్పించిందా? రేటింగ్ ఇదే!

    నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిశ్ విద్యార్థి, రాహుల్ బోస్, వినోద్ కిషన్, విజయలక్ష్మి

    నిర్మాతలు: సుధన్ సందరం, జయరాం, సతీష్‌కుమార్

    డెరెక్టర్: ఐ.అహ్మద్

    సంగీతం: యువన్ శంకర్ రాజా

    సినిమాటోగ్రఫీ: హరి కే.వేదాంతం

    జయం రవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాఢ్’ నేడు తెలుగు  ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సైకోథ్రిల్లర్‌గా  డైరెక్టర్ అహ్మద్ తెరకెక్కించారు. ఆద్యంతం ట్విస్ట్‌లు, ఎమోషనల్ డ్రామాతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే తమిళ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ డబ్బింగ్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా ఎలా ఉంది? చిత్రంలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం.

    కథ

    గాడ్ స్టోరీ విషయానికి వస్తే దూకుడు స్వభావం కలిగిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అర్జున్ (జయం రవి)కి అతడి స్నేహితుడు  ACP ఆండ్రూ (నరైన్) అంటే చాలా ఇష్టం. సాఫిగా సాగుతున్న వారి జీవితానికి  సైకో కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) రూపంలో ప్రతిఘటన ఎదురవుతుంది. ఈ క్రమంలో కిల్లర్ బ్రహ్మ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా హత్యలు చస్తూ తప్పించుకు తిరుగుతుంటాడు. అతన్ని పట్టుకునేందుకు అర్జున్, ఆండ్రూ టీం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆండ్రూ మరణించడంతో మనస్తాపం చెందిన అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి తప్పుకుంటాడు. అయితే అరెస్టయిన సైకో కిల్లర్ బ్రహ్మ  జైలు నుంచి తప్పించుకుని అర్జున్ సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు.. ప్రియ (నయనతార)తో లవ్ ట్రాక్ ఎలా సాగింది? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే?

    అర్జున్ పాత్ర పరిచయంతోనే కథ మొదలు పెట్టిన దర్శకుడు.. నగరంలో  ఉండే 25 ఏళ్ల లోపు అమ్మాయిలు కిడ్నాప్ కావడం.. వారంతా సైకో కిల్లర్ చేతిలో హత్యకు గురికావడం.. వాటిని ఛేదించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగడం.. ఇలా పది నిమిషాల పాటు కథ వేగంగా సాగుతుంది. ఆ తర్వాత కథ నెమ్మదిస్తుంది. హత్యలు జరిగే తీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది. అయితే హత్య సీన్స్ నిడివి ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తుంది.  అర్జున్ సైకో కిల్లర్‌ను పట్టుకోవడం, అతడు జైలు నుంచి తప్పించుకోవడం, కిల్లర్ వెనుక మరో సైకో కిల్లర్ ఉన్నాడని తెలియడంతో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. చనిపోయిన సైకో కిల్లర్‌నే మళ్లి హత్యలు చేస్తున్నాడా.. లేదా మరొకరు ఉన్నాడా.. సైకో కిల్లర్  జైలులో ఉన్నప్పుడు తనలాంటి వ్యక్తిని తయారు చేయడం వంటి సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే సైకో కిల్లర్ వ్యక్తి వెనకున్న మరో సైకోను పట్టుకునేందుకు హీరో పెద్దగా కష్టపడాల్సి ఉండకపోవడం, వ్యక్తిని చూడగానే అతడే హత్యలు చేస్తున్నాడని తెలుసుకోవడం వంటి సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ మంచి థ్రిల్లింగ్‌గా ఉంటాయి.

    ఎవరెలా చేశారంటే

    పోలీస్ కమిషనర్‌ పాత్రలో జయం సూపర్బ్‌గా నటించాడు. సైకో కిల్లర్స్‌గా నటించిన ఇద్దరు నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నయనతార పాత్రకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు.  రెండు మూడు  సన్నివేశాల్లో తప్ప ఎక్కడా కనిపించదు. నరైన్, ఆశిశ్ విద్యార్థి, వినోద్ కిషన్, విజయలక్ష్మి తమ పరిధి మేరకు నటించారు. 

    డెరెక్షన్

    సైకో కిల్లర్స్ హత్యలు చేసే తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అయితే ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ అయిన్పటికీ కథను ఆసక్తికరంగా మలచుకోవడంతో డెరెక్టర్  ఐ.అహ్మద్ కాస్త తడబాటుకు గురయ్యాడు. సైకో కిల్లర్స్ వరుస హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఏంటనేది చెబితే బాగుండేది.

    టెక్నికల్ పరంగా

    గాఢ్ మూవీ నిర్మాణ విలువల పరంగా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో అది కనిపిస్తుంది.

    సినిమాటోగ్రఫీ పర్వాలేదు.  యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ తెచ్చింది. నేపథ్య సంగీతం క్లైమాక్స్ సీన్లు, పోరాట సన్నివేశాలను ఎలివేట్ చేశాయి.

    బలాలు 

    జయం రవి నటన

    ఇంటర్వెల్ సీన్స్

    సెకండ్ హాఫ్‌లో ఆసక్తికర ట్విస్టులు

    బలహీనతలు

    ఫస్ట్ హాఫ్‌ సీన్లు

    పసలేని స్క్కీన్‌ ప్లే

    నయన తారకు స్కోప్‌ లేకపోవడం

    చివరగా

    ఫస్ట్ హాఫ్‌లో నార్మల్‌గా సాగే ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తుంది.

    రేటింగ్:  2.5/5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv