• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!

    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు

    రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌

    సంగీతం: థమన్‌

    సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస

    ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

    నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ

    ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్‌

    విడుదల తేదీ: 12-01-2024

    మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ.

    ఎవరెలా చేశారంటే

    మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు.

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం.

    టెక్నికల్‌గా

    ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • మహేష్ నటన
    • శ్రీలీల డ్యాన్సులు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • కథ, కథనం
    • కొరవడిన భావోద్వేగాలు
    • కనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌

    రేటింగ్‌ : 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv