సౌత్‌లో హీరోల మాదిరి క్రేజ్ సంపాందించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క (Anushka Shetty). తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఇవాళ అనుష్క పుట్టిన రోజు. 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రసిద్ధ తులు కుటుంబం నుండి వచ్చిన అనుష్క నటి అవుతానని ఎప్పడూ అనుకోలేదట. కొన్ని పరిస్థితుల వల్ల నటి కావాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పింది.
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ నుంచి అనుష్క డిగ్రీ పట్టా అందుకుంది. ఈ కాలేజీలోనే స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, అనుష్క శర్మ, మమతా మోహన్ దాస్ వంటి సినీ తారలు చదువుకున్నారు.
అనుష్క కళాశాలలో చదువుకునే రోజుల్లో ‘తపస్య‘ అనే ధ్యాన వర్క్ షాపుకు వెళ్తుండేది. ఆమెకు దానిపై ఆసక్తి లేకపోయినప్పటికీ తన తండ్రి విట్టల్ శెట్టి కోసమే ఆ సెషనుకు హాజరయ్యేది.
అనుష్క శెట్టి తన గురువు భరత్ ఠాకూర్ చేత యోగాలో మెళుకువలు నేర్చుకుంది. ఆ తర్వాత యోగాను తన వృత్తిగా ఎంచుకుంది. ముంబయిలో కొంతకాలం పాటు యోగా సెషన్లు సైతం నిర్వహించింది.
యోగా టీచర్‌గా చాలా బిజీగా ఉన్నప్పుడేే పూరి జగన్నాథ్ డైరక్షన్‌లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో ‘సూపర్‘ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.
నిజానికి అనుష్క శెట్టి అసలు పేరు స్విటీ. ‘సూపర్‘ సినిమా సెట్స్‌లో అందరూ ఆమెను స్విటీ అని పిలిచినప్పుడల్లా ఆమెకు ఇబ్బందిగా అనిపించేదట.
దీంతో తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకోవాలని నిర్ణయించుకుందట. అయితే కుటుంబ సభ్యుల అనుమతి కోసం ఏడాది కాలం పాటు ఈ అమ్మడు వెయిట్ చేయాల్సి వచ్చిందట.
టాలీవుడ్ ఎత్తైన హీరోయిన్లలో అనుష్కశెట్టి ఒకరు. ఆమె ఎత్తు ఏకంగా 5 అడుగుల 9 అంగుళాలు. ఆమె ఏదైనా వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు మన హీరోలు కొందరు ఆమె కన్నా పొట్టిగా కనిపిస్తారు.
అనుష్క ఏదైనా విషయంలో ఒత్తిడి కలిగితే దాన్ని అధిగమించడానికి ఒక ఆసక్తికరమైన పని చేస్తుంది. తనకు అత్యంత ఇష్టమైన సామెతలను చదువుతుంది. అలా చేయడం వల్ల వెంటనే రిలాక్స్ అయిపోతానని ఓ ఇంటర్వ్యూలో అనుష్క తెలిపింది.
అనుష్క శెట్టి ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లాలన్నా సమయపాలన కచ్చితంగా పాటిస్తుందట. అలాగే సరైన సమయానికి ఆహారం తీసుకుంటుందట. ఇది తన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అనుష్క చెప్పింది.
రాత్రి వేళ భోజనం కూడా 8 గంటలలోపే పూర్తి చేస్తుందట. దీని వల్ల ఆమెకు మంచి నిద్ర వస్తుందట. అలాగే ఉదయం 7 గంటలలోపు లేచి యోగాతో రోజును ప్రారంభిస్తానని స్వీటి తన సీక్రెట్‌ను రివీల్ చేసింది.
ఈ యోగా బ్యూటీ అనుష్కకు ఇంగ్లీషులో కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వార్తా పత్రికలను సేకరించే అలవాటు కూడా ఉందట.
‘సైజ్ జీరో’ సినిమా ముందు వరకూ నాజుగ్గా ఉన్న అనుష్క ఆ మూవీ కోసం బిగ్ మిస్టేక్ చేసింది. పాత్ర కోసం విపరీతంగా బరువు పెరిగింది. ఆ తర్వాత సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రభావం ఇప్పటికీ అమెను వెంటాడుతోంది.
సాధారణంగా హీరోయిన్లకు తమ ఫస్ట్ క్రష్ హీరోలు ఉంటారు. కానీ అనుష్క శెట్టి ఇందుకు భిన్నం. తన ఫస్ట్ క్రష్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని ఓ ఇంటర్వూలో రివీల్ చేసింది.
సినిమాల్లోకి రాకముందు నుంచే రాహుల్ అంటే తనకు పిచ్చి అని స్వీటి చెప్పుకొచ్చింది. అయితే రాహుల్ ద్రావిడ్‌ను కలిసే అవకాశం పెద్దగా రాలేదని వాపోయింది.
‘అరుంధతి’ సినిమా అనుష్క ఫిల్మ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ సినిమా సక్సెస్‌తోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ హోదా ఈ అమ్మడు దక్కించుకుంది.
ఆ తర్వాతే రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2, భాగమంతి వంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ఆమె తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
వాస్తవానికి అరుంధతి ఆఫర్ నేరుగా తన వద్దకు రాలేదని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ హీరోయిన్ రిజెక్ట్ చేయడం వల్లే తనకు కలిసొచ్చిందని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం రివీల్ చేయలేదు.
అనుష్క ఫిట్‌నెస్ సీక్రెట్స్‌తో ఓ బుక్ రిలీజైన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ల్యూక్ కుతిన్హో రచనలో వచ్చిన ‘ది మ్యాజిక్ వెయిల్ లాస్ పిల్’ అనే బుక్‌లో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను అనుష్క రివీల్ చేసింది. 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఇందులో ఉంటాయి.
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం ‘ఘాటి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. నేడు అనుష్క బర్త్‌డే సందర్భంగా ఉదయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో స్వీటీ తల, చేతికి రక్తం ఉండగా ఆమె సిగర్ తాగుతూ కనిపించింది.
సాయంత్ర 4:05 గంటలకు ‘ఘాటి’ స్పెషల్ గ్లింప్స్‌ను సైతం మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఇందులో అనుష్క కొడవలి పట్టి ఒకరి పీక కోసి తీసుకెళ్తున్నట్లు దారుణంగా చూపించారు. అనుష్కకు అదిరిపోయే మాస్ ఎలివేషన్ ఇచ్చారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!