• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్… ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?

    తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది.

    ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

    తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అందాల తెగింపు హిందీలోనూ హిట్ చిత్రాల్లో నటించింది. 2012లో బర్ఫీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

     ‘బాద్షాహో’, ‘రుస్తోమ్’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో మెరిసింది. చక్కని శరీర సౌష్ఠవంతో ప్రదర్శించే అందాలతో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది.

    ఇలియానా యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ బోల్డ్ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. 

     2018లో మెకాఫీ ‘మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీ’ సర్వేలో ఇలియానా టాప్‌లో నిలిచింది. ఈక్రమంలో దీపికా పదుకొణె,  ప్రియాంక చోప్రా, ప్రీతి జింటా, కృతి సనన్, పరిణీతి చోప్రా వంటి స్టార్లను వెనక్కి నెట్టింది

    10 ఏళ్ల వయసులోనే ఇలియానా నటన ప్రారంభించింది. ఇండస్ట్రీకి రాకముందే మోడలింగ్ చేసేది.

     ఇలియానాకు డిజైనర్ రింగ్‌లను సేకరించడమంటే హాబీ. ఇప్పటి వరకు ఆమె దగ్గర 400 కంటే ఎక్కువ డిజైనర్ రింగ్‌లు ఉన్నాయి.

     ఆమె ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం.

    ఇలియానా సినీ కెరీర్ హిట్‌ అయినంతగా… పర్సనల్ లైఫ్ మాత్రం కాలేదు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసింది. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడితో రిలేషన్ షిప్‌లో కొనసాగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv