• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్

    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు.

    అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.  ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

    ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 

    అష్టా చమ్మా (2008)

    అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి. 

    రైడ్‌ (2009)

    రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు.

    అలా మెుదలైంది (2011)

    అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.  

    పిల్ల జమీందార్‌ (2011)

    పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. 

    ఈగ (2012)

    దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది.

    భలే భలే మగాడివోయ్ (2015)

    భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. 

    నేను లోకల్‌ (2017)

    నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది. 

    MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017)

    MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది. 

    నిన్ను కోరి (2017)

    నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది. 

    జెర్సీ (2019)

    జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి. 

    గ్యాంగ్ లీడర్‌ (2019)

    గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు. 

    వి (2020)

    వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. 

    టక్‌ జగదీష్‌ (2021)

    టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు. 

    శ్యామ్‌ సింగరాయ్‌ (2021) 

    పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి. 

    అంటే.. సుందరానికీ (2022)

    గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు.

    దసరా (2023)

    దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. 

         మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.

    నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv