హవాయి(Huawei)తో విడిపోయాక హానర్(Honour) కంపెనీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయలేదు. 2020 నుంచి స్మార్ట్‌ఫోన్ కార్యకలపాలను హానర్ నిలిపివేసింది. కానీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ల పంపిణీని కొనసాగించింది. PSAV Global పంపిణీ బాద్యతలను స్వీకరించి విజయవంతంగా నిర్వర్తిస్తోంది. అయితే, తాజాగా హానర్ నుంచి ఇండియాలో స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నట్లు ఖరారైంది. హానర్ 90(Honor 90) సిరీస్ లాంఛ్‌తో ఇండియాలో రీఎంట్రీ ఇవ్వనుంది. మరి, ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర, తదితర వివరాలు తెలుసుకుందాం.
మోడళ్లు
చైనాలో ఈ ఏడాది రెండు మోడళ్లుగా హానర్ 90 రిలీజైంది. హానర్ 90 బేస్ వేరియంట్‌తో పాటు హానర్ 90 ప్రో వేరియంట్ చైనీయులకు అందుబాటులోకి వచ్చాయి. బహుశా ఇండియాలోనూ ఇవే వేరియంట్లు రిపీట్ అయ్యే సూచనలు ఉన్నాయి. అన్నీ కుదిరితే సెప్టెంబర్‌లో హానర్ 90 సిరీస్ లాంఛ్ కానుంది.
డిస్‌ప్లే
హానర్ 90 వేరియంట్ 6.7 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేని కలిగి ఉంది. హానర్ 90 ప్రో వేరియంట్ 6.78 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు దీని సొంతం. ఇండియా మోడళ్లలోనూ దాదాపుగా వీటినే కొనసాగించే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్
ఈ రెండు వేరియంట్లు ఆండ్రాయిడ్ 13 వర్షన్‌కి సపోర్ట్ చేయనున్నాయి. MagicOS 7.1 లేయర్ ఆపరేటింగ్ సిస్టం ఉంది. బేస్, ప్రో వేరియంట్లలో ప్రాసెసర్‌లు వేరే విధంగా ఉన్నాయి.
హానర్ 90 వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్‌సెట్, ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో ఉంది.
హానర్ 90 ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ఎస్‌వోసీ చిప్‌సెట్‌తో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండనుంది.
కెమెరా
హానర్ 90 వేరియంట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
హానర్ 90 ప్రో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 32 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ ఇందులో ఉంది. 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తోంది.
హానర్ 90, హానర్ 90 ప్రో మోడళ్లు డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో రానున్నాయి. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ
రెండు వేరియంట్లు కూడా 5000mAh కెపాసిటీతో కూడిన బ్యాటరీని కలిగి ఉన్నాయి.
హానర్ 90 వేరియంట్ 66వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
హానర్ 90 ప్రో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
స్టోరేజ్
హానర్ 90 వేరియంట్ 12GB RAM, 256 GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తోంది.
హానర్ 90 ప్రో 12GB RAM, 256 GB డీఫాల్ట్ స్టోరేజీని కలిగి ఉంది. 512 GB గరిష్ఠ స్టోరేజ్ ఆప్షన్‌ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది.
ధర
హానర్ 90 వేరియంట్ రూ.44,990కి వచ్చే అవకాశం ఉంది.
హానర్ 90 ప్రో ధర రూ.55,990 గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ