• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Honor Play 8T: అద్భుతమైన ఫీచర్లతో హానర్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఓ లుక్కేయండి!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ హానర్‌ (Honor) మరో సరికొత్త మెుబైల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘హానర్‌ ప్లే 8టీ’ (Honor Play 8T) పేరుతో అత్యాధునిక మెుబైల్‌ను ఇవాళ (అక్టోబర్‌ 18) చైనాలో లాంచ్‌ చేసింది. ‘Honor Play 50 Plus’ మెుబైల్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చారు. అతి త్వరలోనే ఈ మెుబైల్‌ భారత్‌లోనూ రిలీజ్‌ కానుందని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో Honor Play 8T ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల TFT LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 850 nits బ్రైట్‌నెస్‌, 1080 x 2412 pixels రిజల్యూషన్‌ను అందించారు. Android 13 OS, Mediatek Dimensity 6080 ప్రొసెసర్‌తో ఈ మెుబైల్‌ వర్క్‌ చేస్తుంది. 

    స్టోరేజ్‌ సామర్థ్యం

    Honor Play 8Tను చైనాలో రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 8GB RAM / 256GB ROM, 12GB RAM / 256GB ROM వేరియంట్లలో మీకు అవసరమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

    బిగ్‌ బ్యాటరీ

    ఈ మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అందించారు. 6,000mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్‌ చేశారు. ఇది 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఫలితంగా మెుబైల్‌ను చాలా త్వరగా ఛార్జ్‌ చేసుకునే వీలు కలుగుతుంది. 

    కెమెరా క్వాలిటీ

    Honor Play 8T స్మార్ట్‌ఫోన్‌.. డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా కాగా, 2 MP డెప్త్‌ సెన్సార్‌ను అదనపు కెమెరాగా ఫిక్స్‌ చేశారు. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 5 MP కెమెరాను అమర్చారు. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌ 5G, 4G LTE, Wi-Fi 802, Bluetooth 5.1, GPS, AGPS, OTG, USB Type-C పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌ (Accelerometer), ప్రాక్సిమిటీ (Proximity), దిక్సూచి (Compass) వంటి సెన్సార్లూ ఇందులో ఉన్నాయి. 

    కలర్స్‌

    Honor Play 8T మెుబైల్‌ మెుత్తం మూడు రంగుల్లో చైనాలో అందుబాటులోకి వచ్చింది. గ్రీన్‌ (Green), సిల్వర్‌ (Silver), నలుపు (Black) కలర్స్‌ను కలిగి ఉంది. భారత్‌లోనూ ఈ మెుబైల్‌ ఇవే రంగుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

    ధర ఎంతంటే?

    ఈ ఫోన్‌ భారత్‌లో ఏ ధరకు, ఎప్పుడు అందుబాటులోకి రానుందన్న విషయాన్ని హానర్‌ (Honour) అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైనాలో Honor Play 8T ధరను బట్టి ఈ ఫోన్‌ ఇండియాలో రూ.15,000 వరకూ ఉండొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv