చైనా టెక్ దిగ్గజం హానర్ త్వరలో మరో స్మార్ట్ ఫొన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఇది హానర్ 90 సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కొన్నేళ్లుగా భారత మొబైల్ విపణిలోకి హానర్ గ్యాడ్జెట్లు విడుదలవుతున్నప్పటికీ ఇతర బ్రాండుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేపోతున్నాయి. దీంతో హానర్ ఫ్లాగ్‌షిప్ పోగ్రాంను ప్రారంభించింది. Honor 90 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. తొలుత Honor X9a పేరుతో ఓ గ్యాడ్జెట్‌ను అయితే రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.
Honor X9a ప్రత్యేకతలు
డిస్‌ప్లే
Honor X9a 6.67 ఇంచెస్‌తో FHD+OLED కర్వ్డ్ డిస్‌ప్లేతో రానున్నట్లు సమాచారం. డిస్‌ప్లే 120Hz రిఫ్రేష్ రేటుతో, 300Hz టచ్ సామ్‌పిలింగ్ వంటి కొత్త ఫీచర్‌తో రానుంది.
లోలైట్‌లో డిస్‌ప్లే మరింత ప్రకావంతంగా కనిపించనుంది. దీనిలో బ్రైట్‌నెస్ 800nitsగా ఉండనుంది.
కెమెరా:
హానర్ X9a లో ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌తో 5MP అల్ట్రా వైడ్ డెప్త్ సెన్సార్, 2MP మ్యాక్రో లెన్స్ సౌకర్యంతో ట్రిపుల్ కెమెరా కన్ఫిగరిషన్‌తో రానుంది. ఈ బ్యాక్ కెమెరాలో నైట్ మోడ్ ఆప్షన్, పొట్రేయెట్ మోడ్, టైమ్ ల్యాప్స్, HDR వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఫ్రంట్ కెమెరా లేదా సెల్ఫీ కెమెరా 16MP సామర్థ్యంతో 1080p వీడియో రికార్డింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు ఫేస్ రికగ్నిషన్, వైఫై-NFC, టైప్ సీ, బ్లూటూత్ 5.1 అదనపు హంగులతో రానుంది.
బ్యాటరీ;
Honor X9a శక్తివంతమైన బ్యాటరీని ఆఫర్ చేస్తోంది. 5,100mAh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ గ్యాడ్జెట్ 40W రాపిడ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది.
సాప్ట్‌వేర్
హానర్ X9a ఆండ్రాయిడ్ ఓఎస్ బేస్డ్ మ్యాజిక్ యూఐపై రన్ కానుంది. ఇందులోని ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌పై నడవనుంది. దీంతోపాటు 619 GPU గ్రాఫిక్ కార్డు ఉండనుంది. దీనిద్వారా వీడియో ఎడిటింగ్, ఫొటో ఎడిటింగ్ చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు.
స్టోరేజ్
ఈ గ్లాడ్జెట్ రెండు వెరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 8+5జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 256జీపీ స్టోరేజ్ వేరియంట్‌తో లభించనుంది.
ధర
Honor X9a ధరపై ఇంకా అధికారికంగా అయితే సమాచారం లేదు. దీని ధర రూ. 20,000- రూ.25,000 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!