• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Honor X9b Mobile: హానర్‌ నుంచి దిమ్మతిరిగే మెుబైల్‌.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

    ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హానర్‌ (Honor) సరికొత్త మెుబైల్‌తో భారత్‌లోకి రాబోతోంది. ‘Honor X9b’ పేరుతో నయా మెుబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. గతంలో వచ్చిన Honor X9a డివైజ్‌కి కొనసాగింపుగా దీనిని తీసుకొస్తున్నారు. ఇప్పటికే మలేషియా, యూఏఈ వంటి దేశాల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. అక్కడి యూజర్లు దీని వినియోగంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫోన్‌ భారత్‌లో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్‌ ప్రత్యేకతలు, ధర, ఫీచర్లు వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ హానర్‌ మెుబైల్‌ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 1,200×2,652 పిక్సెల్స్‌ క్వాలిటీ, 360 డిగ్రీ యాంటీ డ్రాప్ ప్రొటెక్షన్‌ను అందించారు. Snapdragon 6 Gen 1 SoC చిప్‌సెట్‌ ప్రొసెసర్‌, Android 13 ఆధారిత MagicOS 7.2 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఫోన్ వర్క్‌ చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Honor X9b స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. 8GB RAM + 256GB ROM, 12GB RAM + 256GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో ఈ ఫోన్‌ భారత్‌లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. 

    పవర్‌ఫుల్‌ బ్యాటరీ

    Honor X9b మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి 5,800mAh బ్యాటరీని అమర్చారు. ఇది 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. మెుబైల్‌ త్వరగా ఛార్జ్‌ అయ్యేందుకు సహాయపడుతుంది. 

    కెమెరా సెటప్‌

    ఈ హానర్ మెుబైల్‌ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా +  5MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌ + 2MP మాక్రో సెన్సార్‌ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16MP కెమెరాను ఫిక్స్ చేశారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌లో 5G నెట్‌వర్క్‌, Bluetooth v5.1, Wi-Fi 5, USB Type-C, Dual Band GPS, AGPS, GLONASS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌, యాక్సిలోమీటర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటి సెన్సార్లను ఫోన్‌కు అందించారు. 

    కలర్ ఆప్షన్స్‌

    HONOR X9b మెుబైల్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. సన్‌రైజ్‌ ఆరెంజ్‌ (Sunrise Orange), మిడ్‌నైట్‌ బ్లాక్‌ (Midnight Black), టైటానియం సిల్వర్‌ (Titanium Silver) వంటి రంగుల్లో ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

    ధర ఎంతంటే?

    భారత్‌లో HONOR X9b ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. లాంచింగ్‌ రోజే ధరపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే విదేశాల్లో సేల్‌ అవుతున్న HONOR X9b ఫోన్‌ ధరను బట్టి ఇది రూ.28,990లకు లభించే ఛాన్స్ ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv