• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్ హిస్టరీ ఆటో డిలీట్ చేయడమెలా?

    ఆన్ లైన్ లో విహరించిన తర్వాత హిస్టరీ డిలీట్ చేయడం చాలా ముఖ్యం. ఇది మన వ్యక్తిగత గోప్యతతో పాటు బ్రౌజర్లపై భారాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది కేవలం బ్రౌజర్లకే పరిమితం కాదు యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ ఫాంలకు కూడా వర్తిస్తుంది. అయితే కొన్నిసార్లు మనం యూట్యూబ్ లో హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. అందుకని దానికదే డిలీట్ అయ్యేలా ఆప్షన్ ఉంటుంది. అది ఎలా ఎనేబుల్ చెయ్యాలో చూద్దాం.

    **కంప్యూటర్/పీసీ:**

    – యూట్యూబ్ లోగో పక్కన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి
    – హిస్టరీ టాగుల్ పై క్లిక్ చేయాలి
    – ఆ తర్వాత మేనేజ్ ఆల్ హిస్టరీపై క్లిక్ చేయాలి
    – ఆటో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి
    – ఆటో డిలీట్ యాక్టివిటీ ఎంచుకుని మీకు కావాల్సిన టైం పీరియడ్ ఎంచుకుంటే ఆటేమేటిగ్గా మీ యూట్యూబ్ హిస్టరీ డిలీట్ అవుతుంది.

    **మొబైల్ యాప్:**

    – మొబైల్‌ యాప్ లో లైబ్రరీలోకి వెళ్లి హిస్టరీ ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి
    – ఆ తర్వాత మూడు చుక్కలపై క్లిక్‌ చేస్తే హిస్టరీ కంట్రోల్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.
    – అది ఓపెన్ చేసి మేనేజ్‌ ఆల్ యాక్టివిటీలోకి వెళితే ఆటో డిలీట్ ఆప్షన్‌ కనిపిస్తుంది.
    – ఆ తర్వాత పీసీలో మాదిరిగానే ఆటో డిలీట్ యాక్టివిటీ ఎనేబుల్ చేసుకోవాలి.

    **మరోవిధానం**:

    – మీ గూగుల్ అకౌంట్లో మేనేజ్ యువర్ యాక్టివిటీపై క్లిక్ చేయండి.
    – అక్కడ డేటా&ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
    – అందులో హిస్టరీ మేనేజ్ మెంట్ లో యూట్యూబ్ హిస్టరీ సెలెక్ట్ చేసుకోండి.
    – అక్కడ ఆటో డిలీట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ యూట్యూబ్ యాక్టివిటీ ఆటోమెటిగ్గా డిలీట్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv