చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ హువావే (Huawei) సరికొత్త ట్యాబ్లెట్ రిలీజ్‌కు సిద్దమైంది. సెప్టెంబర్ 25న జరిగే ‘Autumn 2023’ ఈవెంట్‌లో ఈ నయా ట్యాబ్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘Huawei MatePad Pro 13.2’ పేరుతో దానిని పరిచయం చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్యాడ్‌కు సంబంధించిన టీజర్‌ను సైతం హువావే విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేసిన ‘Huawei MatePad 11’ ట్యాబ్‌కు అనుసంధానంగా దీన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ ట్యాబ్ ఫీచర్లకు సంబంధించిన సమాచారం లీకయ్యింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్ స్క్రీన్
Huawei MatePad Pro స్క్రీన్‌ను ప్రీవియస్ ట్యాబ్‌తో పోలిస్తే కాస్త పెంచినట్లు సమాచారం. 13.2 అంగుళాల స్క్రీన్‌తో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. Kirin 9000s చిప్‌సెట్, Mali-G78 GPUతో ఇది వర్క్ చేయనుంది. 3D ఫేస్ అన్‌లాక్ సిస్టమ్‌తో ఇది రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
స్టోరేజ్ సామర్థ్యం
హువావే ఇటీవల లాంచ్ చేసిన Huawei Mate 60, Mate X5 foldable స్మార్ట్ ఫోన్లలో Kirin 9000s చిప్‌సెట్‌నే వినియోగించారు. ఇది 12GB RAM – 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని ఆ చిప్‌సెట్ జత చేశారు. దీంతో Huawei MatePad Pro 13.2ను కూడా అదే స్టోరేజ్ సామర్థ్యంలో తీసుకొచ్చే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
రెట్టింపు వేగం
‘Huawei MatePad 11’తో పోలిస్తే ఇది మరింత వేగంగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఫైల్స్ వేగంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఇది lower power consumptionను కలిగి ఉంటుందని పేర్కొంటున్నాయి.
కెమెరా
Huawei MatePad 11ను వెనకవైపు 13MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాతో తీసుకొచ్చారు. అయితే నయా ట్యాబ్‌లో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది వెనకవైపు ట్రిపుల్ రియర్ కెమెరాలతో రానుందట. ముందు వైపు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే ఈ నెల 25వరకూ ఆగాల్సిందే.
బిగ్ బ్యాటరీ
Huawei MatePad Pro బిగ్ బ్యాటరీతో రానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 7250mAh బ్యాటరీతో దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. పైగా ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ప్రివియస్ ట్యాబ్ కూడా ఇదే బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండటం గమనార్హం.
కలర్స్
ఈ ట్యాబ్ మెుత్తం మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నట్లు సోషల్ మీడియాలోని ప్రచార ఫొటోలను బట్టి తెలుస్తోంది. నీలం, నలుపు, తెలుపు కలర్ ఆప్షన్స్‌లో ఈ ట్యాబ్ విడుదల కానున్నట్లు టెక్ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
ధర ఎంతంటే?
‘Huawei MatePad Pro 13.2’ ధరను హువావే అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని ప్రారంభ ధర భారత్‌లో రూ.45,990 వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ 25న ధరపై స్పష్టత రానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!