• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Huawei Nova 11 SE: హువావే నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్ కంపెనీ ‘హువావే’ ఎప్పటికప్పుడు సరికొత్త మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ కంపెనీ ఫోన్లకు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే మరో సూపర్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు హువావే సిద్ధమైంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ‘హువావే నోవా 11 ఎస్‌ఈ’ (Huawei Nova 11 SE) మెుబైల్‌ను దేశీయంగా రిలీజ్‌ చేసేందుకు చైనీస్‌ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ‘Huawei Nova 11’ సిరీస్‌కు అనుసంధానంగా ఈ ఫోన్‌ను తీసుకురానుంది. మరి ఈ మెుబైల్  ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం. 

    ఫోన్ స్క్రీన్‌

    ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 90Hz రిఫ్రెష్‌ రేట్, 1080 x 2400 పిక్సెల్‌ రిజల్యూషన్‌ను అందించారు. Harmony 4.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఫోన్‌ రన్‌ అవుతుంది. Qualcomm Snapdragon 680 4G ప్రొసెసర్‌, Octa-core సీపీయూ, Adreno 610 జీపీయూతో ఇది పని చేయనుంది. 

    బ్యాటరీ

    Huawei Nova 11 SE స్మార్ట్‌ఫోన్‌కు 4500 mAh బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. ఇది 66 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఫోన్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కేవలం 32 నిమిషాల్లోనే 100% ఛార్జ్‌ అవుతుందని ప్రకటనలో పేర్కొంది. 

    కెమెరా క్వాలిటీ

    ఈ మెుబైల్‌కు క్వాలిటీ కెమెరాలను అందించారు. వెనక భాగంలో 108 MP ప్రైమరీ కెమెరా + 8 MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌ +  2 MP మాక్రో కెమెరాలను అమర్చారు. వీటి సాయంతో క్వాలిటీ ఫొటోలను, 1080p @ 30fps వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో 32 మెగా పిక్సెల్స్‌తో కూడిన కెమెరా ఉంటుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ మెుబైల్‌ను హువావే రెండు వేరియంట్లలో చైనాలో లాంచ్ చేసింది. 8GB ర్యామ్‌ / 256GB స్టోరేజ్‌, 8GB ర్యామ్‌ / 512GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో ఇది అందుబాటులో ఉండనుంది. 

    కనెక్టివిటి ఫీచర్లు

    Huawei nova 11 SE మెుబైల్‌లో Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.0, GPS, సైడ్‌ మౌంటెట్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌ (accelerometer), గైరో (gyro), ప్రొక్సిమిటీ (proximity), దిక్సూచి (compass) వంటి ఫీచర్లు ఉన్నాయి.

    కలర్స్‌

    Huawei Nova 11 SE స్మార్ట్‌ఫోన్ మూడు రంగులలో దేశీయ మార్కెట్‌లోకి రానుంది. నలుపు (Black), ఆకుపచ్చ (Green), తెలుపు (White) కలర్ ఆప్షన్స్‌లో ఇది లభించనుంది. 

    ధర ఎంతంటే?

    Huawei Nova 11 SE ధర, విడుదల తేదీని హువావే అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైనాలో ఈ మెుబైల్‌కు నిర్ణయించిన ధరను బట్టి 8GB RAM / 256GB ROM ధర రూ. 23,000, 8GB RAM, 512GB ROM వేరియంట్‌ ధర రూ. 25,000గా ఉండొచ్చని అంచనా. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv