ఆగస్టు నెలలో వరుస పెట్టి స్మార్ట్ ఫోన్లు భారత్‌లో విడుదలవుతున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన అత్యాధునిక ఫోన్లు వినియోగదారులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి మరో అధునాతన మెుబైల్ మార్కెట్‌లోకి వచ్చింది. Infinix GT 10 Pro పేరుతో దీనిని లాంఛ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మెుబైల్ తాలూకూ టీజర్ మెుబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నథింగ్ ఫోన్‌ను పోలి ఉండే అడాప్టివ్ LED ఇంటర్‌ఫేస్‌తో దీనిని తీసుకురావడంతో ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర, బ్యాటరీ, కెమెరా క్వాలిటీ వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
Infinix GT 10 Pro ఫోన్‌ను 6.67 అంగుళాల 10బిట్ AMOLED స్క్రీన్‌తో తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 900 nits అత్యుత్తమ బ్రైట్‌నెస్‌ను ఫోన్‌కు అందించారు. MediaTek Dimensity 8050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది.
స్టోరేజ్ సామర్థ్యం
Infinix GT 10 Pro ఫోన్ 8GB LPDDR4X RAM ర్యామ్‌తో వచ్చింది. ఈ RAMను వర్చువల్‌గా మరో 8GB వరకూ ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ 256GB UFS 3.1 స్టోరేజీని కలిగి ఉంది. MicroSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు.
బ్యాటరీ
Infinix GT 10 Pro మెుబైల్‌ను 5,000mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ బైపాస్ చార్జింగ్ మోడ్‌తో వస్తుండటంతో ఛార్జింగ్ సమయంలో హీటింగ్ సమస్యలు ఉండవు. గేమింగ్ సమయంలోనూ ఫోన్ హీట్ ఎక్కదని ఇన్ఫినిక్స్ వర్గాలు తెలిపాయి.
కెమెరా క్వాలిటీ
Infinix GT 10 Pro అత్యంత నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 108 MP ప్రైమరి సెన్సార్, రెండు 2MP కెమెరా సెన్సార్లను ఫిక్స్ చేశారు. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో క్వాలిటీ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ముందు వైపు 32 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
5G సపోర్ట్
Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ 5G సేవలకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో Bluetooth, Wi-Fi a/b/g/n/ac/x, USB Type-C port వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. లైట్ సెన్సార్, దిక్సూచి, జీ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లు ఫోన్‌లో అదనపు ఫీచర్లుగా ఉన్నాయి.
కలర్స్
ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో ఫోన్ రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
Infinix GT 10 Pro స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. దీని ధరను రూ.19,999గా నిర్ణయించారు. ICICI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కొనుగోలుపై రూ.1250 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే కొటాక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించినా రూ.1250 రాయితీ పొందవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!