ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ నుంచి మరో అత్యాధునిక 5G ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. Infinix Note 30 5G పేరుతో ఈ ఫోన్ రిలీజ్ చేయనున్నారు. తయారీ సంస్థ రిలీజ్ డేట్ ప్రకటించనప్పటికీ జూన్ నెల అర్ధభాగంలోనే ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఇప్పటికే Infinix Note 30 5G పలు దేశాల్లో విడుదలై ఆకట్టుకుంటోంది. దీనికి తోడు Infinix మెుబైల్స్‌కు భారత్‌లో మంచి గుడ్‌విల్ ఉండటంతో అప్‌కమింగ్ ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ధర ఎంత? ఏయే రంగుల్లో అందుబాటులోకి రానుంది? వంటి అంశాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
డిస్‌ప్లే
Infinix Note 30 5G ఫోన్‌ను 6.78 అంగుళాల Full HD + (1,080×2,460 pixels) IPS LTPS LCD డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ 240Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. ఇది Android 13 OS, Octa core MediaTek Dimensity 6080 SoC ప్రాసెసర్‌తో పనిచేయనుంది.
బ్యాటరీ
Infinix Note 30 5G 5,000mAh బ్యాటరీతో రానుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 30 నిమిషాల్లోనే 75శాతం మేర ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
స్టోరేజ్
Infinix Note 30 5G ఫోన్‌ను రెండు రకాల స్టోరేజ్ సామర్థ్యంతో తీసుకొస్తున్నారు. 6GB RAM/128GB ROM, 8GB RAM/256GB ROM వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. microSD card ద్వారా ఈ స్టోరేజ్ సామర్థ్యాన్ని 2TB వరకూ పెంచుకోవచ్చు.
కెమెరా
Infinix Note 30 5G ఫోన్‌లో కెమెరానే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌ను 108MP+8MP+2MP ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. ప్రైమరీ కెమెరా ఏకంగా 108MP ఉండటం వల్ల అత్యంత నాణ్యమైన ఫొటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు.
కలర్స్
Infinix Note 30 5G మెుత్తం మూడు రంగుల్లో లభించనుంది. బ్లూ, మ్యాజిక్ బ్లాక్, సన్‌సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ అందుబాటులోకి రానుంది.
ధర ఎంతంటే?
Infinix Note 30 5G ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ రూ.20,990కు అందుబాటులోకి రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!