• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Infinix XE27 TWS: తక్కువ ధరలో యాపిల్ ఎయిర్ పాడ్స్ తరహా ఫీచర్లు– మరి వీటిని కొనొచ్చా? పూర్తి సమీక్ష

    బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫొన్‌లకు ఇన్ఫినిక్స్ పేరుపొందింది. ఇప్పుడు ఈ కంపెనీ ఆడియో విభాగంలో అడుగుపెట్టి, కొత్తగా Infinix XE27 TWS ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్‌ల ధర ₹2,000 ఉండగా, అందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC), ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ (ENC), లో-లాటెన్సీ గేమింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్లు ఈ ధరకు సరిపడుతాయా? YouSay రివ్యూలో తెలుసుకుందాం.

    డిజైన్- ఫీచర్లు

    Infinix XE27 TWS ఇయర్‌బడ్‌లు సాదాసీదా డిజైన్‌తో, తేలికపాటి ప్లాస్టిక్ నిర్మాణంతో వచ్చాయి. ఛార్జింగ్ కేస్ రాయల్ బ్లూ,  ఇంపీరియల్ వైట్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఛార్జింగ్ కేస్ గ్లాసీ ఫినిష్ కలిగి ఉంది, ఇది ఫింగర్‌ప్రింట్‌లు మరియు స్క్రాచులకు త్వరగా గురవుతుంది.  కొన్ని రోజుల్లోనే కేస్‌పై స్క్రాచులు పడటాన్ని మా రివ్యూలో గమనించాము.

    మొత్తంగా కేస్ నిర్మాణం బాగానే ఉంది కానీ, ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం సగటుగా అనిపించింది. రెడ్మీ బడ్స్ 5C వంటి ఇయర్ బడ్స్ దీంతో పోలిస్తే బలమైన నిర్మాణంతో వస్తాయి. ఇయర్‌బడ్‌లతో అదనపు ఇయర్ టిప్‌లు కూడా వస్తాయి, దీని వలన సౌకర్యవంతమైన ఫిట్ లభిస్తుంది. IPX4 రేటింగ్ కూడా ఉండటం వల్ల చెమట మరియు తేలికపాటి వర్షం ప్రతికూలతల నుండి రక్షణ ఉంటుంది. అయితే, టచ్ కంట్రోల్‌లు కొంచెం కఠినంగా అనిపించాయి. అలాగే, ఈ కంట్రోల్స్‌ను కస్టమైజ్ చేయడానికి యాప్ లేకపోవడం కూడా ఇబ్బంది పెట్టింది.

    సౌండ్ క్వాలిటీ 

    Infinix XE27 ఇయర్‌బడ్‌ల సౌండ్ క్వాలిటీ పర్వాలేదనిపించింది. 10mm డైనమిక్ డ్రైవర్‌ల ద్వారా, ఈ బడ్స్ బాస్-హెవీ సౌండ్‌ను అందిస్తాయి. అయితే, బాస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కాలింగ్ సమయంలో కొంచెం కష్టంగా అనిపించింది.  సౌండ్ క్వాలిటీని మెరుగుపరచుకోవడానికి యాప్ లేకపోవడం కూడా ఒక పెద్ద లోపం.

    ANC సపోర్ట్ ఉన్నప్పటికీ, ఇది అంచనాలకు తగ్గట్టుగా పనితీరు చూపించలేదు. ఈ ధరకు ANC అందించడం సంతోషకరమే అయినప్పటికీ, అధిక శబ్దాలలో పెద్ద మార్పు కనిపించలేదు. అలాగే, ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా అంతగా ప్రభావం చూపలేదు.

    కాల్ క్వాలిటీ

    కాల్ క్వాలిటీ సాధారణంగా ఉండగా, కొన్ని సందర్భాల్లో మఫుల్‌గా వినిపించింది. బయటి శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల, ఇతర వ్యక్తులకు మీ వాయిస్ స్పష్టంగా వినబడదు.

    బ్యాటరీ లైఫ్ 

    Infinix XE27 TWS బడ్స్ బ్యాటరీ లైఫ్ విషయంలో మంచి పనితీరు చూపించాయి. ANC ఆన్ చేసినప్పుడు 4.5 గంటల వరకు ప్లేబ్యాక్ అందించాయి. ఛార్జింగ్ కేస్ సాయంతో మొత్తం 26-28 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 10 నిమిషాల చార్జింగ్ ద్వారా ఒక గంట ప్లేబ్యాక్ అందుకోవచ్చు, ఇది ప్రయాణాల సమయంలో చాలా  ఉపయోగకరంగా ఉంటుంది. బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ చాలా బాగుంది.

    Infinix XE27 TWS కొనవచ్చా?

    ఈ ఇయర్‌బడ్‌లను బడ్జెట్‌కు తగ్గట్టు ANC మరియు బాస్-హెవీ సౌండ్‌తో  రూపొందించినప్పటికీ, నిర్మాణ నాణ్యత, సౌండ్ క్లారిటీ, ANC పనితీరం విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ ధరలో రెడ్మీ బడ్స్ 5C వంటి  వేరబుల్స్ ఇంకా మెరుగైన బిల్డ్ క్వాలిటీ, సౌండ్ కస్టమైజేషన్ యాప్‌తో వస్తాయి.

    ప్రయోజనాలు:

    • అందుబాటు ధర
    • బాస్-హెవీ సౌండ్, బాస్ లవర్స్‌కు అనుకూలం
    • IPX4 రేటింగ్, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్
    • లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్  ఛార్జింగ్‌

    లోపాలు:

    • గ్లాసీ ప్లాస్టిక్ కేస్‌పై సులభంగా ఫింగర్‌ప్రింట్‌లు, స్క్రాచులు పడటం
    • ఇతర ఇయర్‌ బడ్స్‌తో పోలిస్తే నాణ్యత లేమి
    • అంచనాలకు తగ్గట్టుగా లేని ANC
    • కాల్ సమయంలో తక్కువ నాణ్యత, ఎక్కువ బాహ్య శబ్దం
    • సౌండ్ కస్టమైజేషన్ కోసం డెడికేటెడ్ యాప్ లేకపోవడం
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv