ఇన్ఫినిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా Infinix Zero Flip 5Gను విడుదల చేసిన ఒక నెల తర్వాత, అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఇది ఇన్ఫినిక్స్ మొట్టమొదటి క్లామ్‌షెల్-శైలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మరియు Motorola Razr 50, Tecno Phantom V Flip 5G వంటి మొబైళ్లతో పోటీ పడుతుందని ఆశిస్తున్నారు.
ఈ ఫోన్ ఇండియన్ స్పెసిఫికేషన్లు విడుదల కంటే ముందు, Infinix దీనిలోని డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ఇతర సంబంధిత ఫీచర్ల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను ప్రకటించింది.
ఫీచర్లు
Infinix Zero Flip 5G ఫోన్ డిస్‌ప్లే వివరాల ప్రకారం, ఈ డివైస్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు డ్యూయల్ LED ఫ్లాష్ సదుపాయాలు ఉన్నాయి. ఫోన్ 4K రిజల్యూషన్‌లో 30 ఫ్రేమ్‌ల (fps) వరకు వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం, 50-మెగాపిక్సెల్ కెమెరా 4K 60fpsలో వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది, అలాగే ప్రో స్టేబుల్ వీడియో ఫీచర్లు కూడా అందిస్తుంది. స్నాప్‌షాట్‌లు తీసేటప్పుడు LED , స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.
Infinix Zero Flip 5Gలో AI Vlog మోడ్ ఉంది, ఇది వీడియో ఎడిటింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ముందు, వెనుక కెమెరాల నుంచి ఒకేసారి రికార్డింగ్ చేయడానికి డ్యూయల్ వ్యూ మోడ్‌ను ఇవి కలిగి ఉంటాయి.
Infinix Zero Flip 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3.64-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ పెద్ద స్క్రీన్ వినియోగదారులకు మల్టీటాస్కింగ్‌లో సహాయపడుతుంది, నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడం, యాప్‌లతో ఇంటరాక్ట్ చేయడం మరియు మీడియా ప్లేబ్యాక్‌ను నియంత్రించడం వంటి పనులను ఫోన్‌ను తెరవకుండానే అనుమతిస్తుంది. ఈ ఫోన్ 4,00,000 సార్లు ఫోల్డ్ చేయడానికి రూపొందించబడింది, దాంతో దాని దృఢత్వం పెరుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 512GB స్టోరేజ్‌ను కలిగి ఉంది మరియు 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీనికి 4720mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది.