మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ (iPhone 15 Series) మోడళ్లు లాంచ్ అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 09) రాత్రి జరిగిన లాంచ్ ఈవెంట్లో లేటెస్ట్ ఐఫోన్లతో పాటు ఇతర ప్రొడక్ట్స్‌ను యాపిల్ రిలీజ్ చేసింది. అయితే ముందు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, కొత్త ఐఫోన్లను యాపిల్ సరికొత్త స్పెసిఫికేషన్లతో రూపొందించింది. ఐఫోన్ 16 సిరీస్ గ్యాడ్జెట్స్ అన్నీ A18 బయోనిక్ చిప్ సహా కొత్తగా యాపిల్ ఇంటలిజెన్స్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
యాక్షన్ బటన్ (Action Button)
ఆపిల్ 15 సిరీస్‌లో తీసుకొచ్చిన యాక్షన్ బటన్ (Action Button).. ఐఫోన్ 16లోనూ కొనసాగిస్తున్నారు. ఐఫోన్ 14 వరకు గ్యాడ్జెట్ పక్కభాగంలో వాల్యూమ్ రాకర్పైన మ్యూట్ లేదా వైబ్రేట్ బటన్‌ను ఇచ్చేవారు. ఐఫోన్ 15 ప్రో మోడల్స్ (iPhone 15 pro)లో దాన్ని యాక్షన్ బటన్‌తో రీప్లేస్ చేశారు. కెమెరాను యాక్టివేట్ చేయడం, ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, ఫోకస్ మోడ్‌లను మార్చడం వంటి ఫంక్షన్లను ఈ బటన్ ద్వారా చేయవచ్చు. రింగ్, వైబ్రేట్ ఆప్షన్స్‌ను కూడా ఈ బటన్ సాయంతో మార్చుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్లను ఈ బటన్‌కు అసైన్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
నాలుగు మోడల్స్‌లో(Four Models)
ఐఫోన్ 16 సిరీస్ 4 మోడల్స్‌లో లభించనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ఫ్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ నాలుగు మోడళ్లు అన్నీ కూడా 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరీజీ వేరియంట్లలో లభించనున్నాయి.
మళ్లీ గోల్డ్ కలర్ (New Four colour options)
చాలా రోజుల తర్వాత యాపిల్ కంపెనీ గోల్డ్ కలర్ ఐఫోన్ 16 మోడల్స్‌లో అందుబాటులో ఉంచింది. ఈసారి బ్లూ, గ్రీన్, బ్లాక్, గోల్డ్ కలర్ అప్షన్స్ అందించనుంది.
మారిన డీజైన్
ఐఫోన్ 15, ఐఫోన్ 14కి చాలా దగ్గరి పోలిక కలిగి ఉంటుంది. అయితే ఐఫోన్ 16 డిజైన్ మారినట్లు లీక్స్ వినిపిస్తున్నాయి. ఐఫోన్ 16లో నిలువు కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది iPhone 12 పోలి ఉండనున్నట్లు తెలుస్తోంది. కానీ కెమెరా సెన్సార్లు పెద్దగా ఉండనున్నాయి. కొత్త iPhoneకి అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
బిగ్గర్ డిస్ప్లే
ఇక డిస్ప్లే విషయంలోనూ ఐపోన్ 16లో మార్పులు తెచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల OLED డిస్ప్లే అందుబాటులో ఉండనుంది. గతంలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.5 అంగుళాల OLED డిస్ప్లే మాత్రమే ఉండేది.
శాటిలైట్ కాలింగ్
అన్ని యాపిల్ 16 ప్రో మోడల్‌లలో iOS 18తో సిమ్ కార్డ్ లేకుండా అన్ని దేశాలకు కాల్స్, మెసెజెస్ చేయవచ్చు. అప్‌గ్రేడ్ చేయబడిన శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా ఈ ఫీచర్‌ను కల్పించింది.
యాపిల్ ఇంటలిజెన్స్ (Apple Intelligence)
ఐఫోన్ 16లో మరో కొత్త ఫీచర్ యాపిల్ ఇంటలిజెన్స్. iPhone 16లో కొత్త A18 చిప్‌తో అందించబడుతోంది. ఇది బేస్ మోడల్స్‌తో పాటు iPhone 16 Plus, ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్‌లలో Apple ఇంటెలిజెన్స్‌ని ఎనేబుల్ చేస్తుంది. యాపిల్ ఇంటలిజెన్స్ ముఖ్యంగా చాట్‌జీపీటీ లాంటి ఫీచర్స్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.
లాంగ్ బ్యాటరీ లైఫ్
ఐఫోన్ 16 మోడల్స్‌లో బ్యాటరీ కెపాసిటీని పెంచారు. ఐఫోన్ 16 ప్లస్‌లో 4006mAh, ఐఫోన్ 16 ప్రోలో 3,367, ఐఫోన్ 16 ప్రో మ్యాక్‌లో 4,676కి కెపాసిటీని పెంచడం జరిగింది. దీంతో ప్రో మ్యాక్స్ వేరియంట్ 30 గంటల లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండనుంది.
టైటానియం డిజైన్
ఐఫోన్ సిరీస్‌లో ఆకట్టుకుంటున్న మరో ఫీచర్ టైటానియం డిజైన్. ఈ సిరీస్‌లోని iPhone 16 సిరీస్ మోడల్స్‌ను టైటానియం డిజైన్‌తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్ బరువు చాలా వరకు తగ్గడమే కాకుండా చాలా స్లిమ్‌గా స్టైలిష్‌గా ఫోన్ కనిపిస్తుంది.
పవర్ఫుల్ ప్రాసెసర్
ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్‌లో ఏ16, ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌ను అమర్చారు. అయితే ఐఫోన్ 16 అన్ని మోడల్స్‌లో A18 చిప్‌తో రీప్లెస్ చేయనున్నారు. ఐఫోన్ 15 బేస్ మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 16 బేస్ మోడల్స్ 7 రెట్లు వేగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నో కెమెరా అప్‌గ్రేడ్
ఐఫోన్ 15 మోడల్ మాదిరి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో కూడా 48MP f/1.6 బ్యాక్ కెమెరా, 12MP f/2.2 ఫ్రంట్ కెమెరా సెటప్‌తో రానుంది. కెమెరాలో పెద్దగా మార్పులు చేయనప్పటికీ మెగాపిక్సెల్స్ కౌంట్ పెంచినట్లు సమాచారం. దీంతో లోలైట్ కండీషన్లో మరింత షార్ప్‌గా ఫోటోలు రానున్నాయి. వీటితో పాటు మాక్రో ఫోటోగ్రఫీ, స్పెషియల్ వీడియో క్యాప్చర్ వంటి ఫీచర్స్ కలిగి ఉండనున్నట్లు తెలిసింది.
ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్
గత ఐఫోన్ సిరీస్‌లను పరిశీలిస్తే ప్రో మోడల్స్‌కు మాత్రమే ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ పరిమితమైంది. కానీ, ఈసారి ఈ స్టైలిష్ ప్యానెల్‌ను బేసిక్ మోడల్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌లోనూ తీసుకొచ్చారు. దీనివల్ల ఫింగర్ప్రింట్లు సహా ఇతరత్రా మరకల నుంచి కెమెరా లెన్సెస్కు రక్షణ లభిస్తుంది. అంతేగాక ఈ ప్యానెల్ ఫోన్‌కు చాలా ప్రీమియం లుక్‌ను తీసుకొస్తుంది.
హయ్యర్ రీఫ్రెష్ రేట్
మొత్తానికి యాపిల్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రీఫ్రేష్ రేట్‌ను 60Hz నుంచి 120Hzకు అప్‌గ్రేడ్ చేసింది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. దీంతో ఐపోన్ 16 డిస్ప్లే మరింత ప్రీమియం లుక్ యాక్షనబుల్గా కనిపించనుంది.
ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ (Faster MagSafe wireless charging)
గత మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 16లో మ్యాగ్సెఫ్ వైర్లెస్ ఛార్జింగ్ మరింత వేగంగా రన్కానుంది. ఐఫోన్ 15లో Qi2-ఆధారిత ఛార్జింగ్ ఉత్తమమైన వైర్లెస్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చినప్పుడు కాస్త వెనకబడినట్లు చెప్పవచ్చు. కానీ Apple iPhone 16లో ఛార్జింగ్ స్పీడ్‌ను పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదివరకు ఐఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయ్యేందుకు దాదాపు రెండు గంటలు సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం గణనీయంగా తగ్గనుందని సమాచారం.
ధరలు ఎంతంటే?
ఐఫోన్ 16 సిరీస్ ధరలను లాంచింగ్ ఈవెంట్లోనే యాపిల్ సంస్థ ఖరారు చేసింది. ఐఫోన్ 16 (128 GB) $799(రూ.67,000), ఐ ఫోన్ 16 Plus (128 GB) $899( రూ. 75,400), ఐ ఫోన్ 16 Pro (256GB) ధర $1099( రూ. 92,261)గా యాపిల్ నిర్ణయించింది. అలాగే ఐఫోన్ 16 Pro Max (256 GB) $1199(రూ.1,00,656). మరో మూడు రోజుల్లో ఐఫోన్ 16 బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. నేరుగా యాపిల్ వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!