గ్యాడ్జెట్ ఇండస్ట్రీలో ఐఫోన్లకు ఉండే డిమాండ్ వేరు. యాపిల్ కంపెనీ నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ ఎప్పుడొస్తుందా? అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు మొబైల్ ప్రియులు. ఈ క్రమంలో రాబోయే ఐఫోన్ సిరీస్ గురించి గుసగుసలు వినిపించడం సహజం. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 14 సిరీస్ ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్/ అక్టోబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో యాపిల్ బహు మార్పులు చేస్తుందని టాక్. అయితే, ఇప్పుడు కళ్లన్నీ ఐఫోన్ 16 సిరీస్ మీద పడ్డాయి. 15 సిరీస్ రిలీజ్ కాకుండానే 16 సిరీస్ ఫీచర్లపై రూమర్లు దండెత్తుతున్నాయి. మరి, లీకైన ఫీచర్లేంటో ఓ సారి చూసేద్దాం.
ఐదు మోడళ్లుగా..
ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు మోడళ్లు రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్‌లోనూ ఐఫోన్ 15, 15 ప్లస్,15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ రానున్నాయి. అయితే, 16 సిరీస్‌లో మాత్రం 5 మోడళ్లు రానున్నట్లు తెలుస్తోంది. పై నాలుగింటి కన్నా హైయ్యర్ ఎండ్ ఫోన్‌ని రిలీజ్ చేయాలని యాపిల్ భావిస్తోంది. ఐఫోన్ 16 అల్ట్రా(iPhone 16 Ultra)గా దీనిని తీసుకురానుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అయితే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్థానంలో ఐఫోన్ 16 అల్ట్రాని ప్రవేశపెట్టే పరిస్థితిని కూడా కొట్టిపారేయలేమని పేర్కొంది.
యునిఫైడ్ సాలిడ్ స్టేట్ బటన్
ప్రస్తుతం ఉన్న వాల్యూమ్ బటన్‌ని ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లలో రీడిజైన్ చేయాలని ‘మాక్‌రూమర్స్’(MacRumors) వెల్లడించింది. వాల్యూమ్ బటన్‌ని యునిఫైడ్ సాలిడ్ స్టేట్ బటన్స్‌గా లాంఛ్ చేయాలని చూస్తోందట. ఇప్పటికే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో మ్యూట్ స్విచ్‌ని కస్టమైజ్డ్ బటన్‌గా తీసుకొస్తోంది. ఐఫోన్ రిలీజ్ అయిన నాటి నుంచి మ్యూట్ బటన్ విషయంలో చేయని మార్పులను 15 ప్రో మ్యాక్స్‌లో చేస్తోంది. అందుకే, 16 ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లలోనూ డిజైనింగ్ మార్పులు చేయాలని చూస్తోందట. అన్నింటికీ కలిపి ఒకే బటన్‌ని అమర్చనున్నట్లు మ్యాక్‌రూమర్స్ తెలిపింది.
అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడీ
ఐఫోన్ 16 మోడళ్లలో మరో ఫీచర్‌ని పరిచయం చేయాలని చూస్తోందట. ‘అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడీ’(Under Display Face ID) ఫీచర్‌ని ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. డైనమిక్ ఐలాండ్ సైజ్‌ని తగ్గించే ఉద్దేశంతో ఫేస్ ఐడీని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పంచ్ ఫ్రంట్ కెమెరాకి మరింత కాంపాక్ట్ హోల్‌ని అనుమతించే వీలుంది.
కెమెరా అప్‌గ్రేడేషన్
ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రధానంగా కెమెరా అప్‌గ్రేడేషన్ ఉండనుందట. ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో స్టాక్డ్ సీఐఎస్ డిజైన్ (Stacked CIS Design)ని పాటించాలని యాపిల్ చూస్తోందట. సీఐఎస్ ఇమేజ్ సెన్సార్‌తో పాటు మరిన్ని సెన్సార్లను ఒకదానిపై ఒకటి అమర్చనుంది. దీంతో ఇమేజ్ క్వాలిటీ మరింత మెరుగుపడి స్పేస్ కలిసొస్తుంది. ఈ సెన్సార్లను సోనీ(Sony) కంపెనీ నుంచి దిగుమతి చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. వాస్తవానికి ఐఫోన్ 15 ప్రో మోడళ్లలోనే ఈ స్టాక్డ్ సీఐఎస్ డిజైన్‌ని తీసుకు రావాలని యాపిల్ చూసింది. కానీ, సరిపడా సెన్సార్లు అందుబాటులో లేకపోవడంతో 16 ప్రో మోడళ్లలో ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నట్లు విశ్లేషకుడు మింగ్ చి కువో తెలిపారు.
సూపర్ టెలిఫోట్ లెన్స్
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లలో పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌లను వాడనుందట. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మాదిరే 16 ప్రో మోడళ్లలోనూ దీనిని తీసుకు రానుంది. అల్ట్రా వైడ్ కెమెరా లెన్సెస్‌తో పాటు అప్‌గ్రేడెడ్ టెలిఫొటో లెన్స్‌లతో కలిపి ఈ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లను ఉపయోగించనుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో పెరిస్కోప్ లెన్స్ ‘అల్ట్రా లేదా సూపర్ టెలిఫొటో లెన్స్’గా నిలవనుంది. 1/1.4 అంగుళాల ఇమేజ్ సెన్సార్‌లతో కూడిన 7 పీస్ లెన్స్ సిస్టం ఇది. 6X ఆప్టికల్ జూమ్‌కి ఇది సపోర్ట్ చేయనుంది. ఇక, ఐఫోన్ 16 బేస్ వేరియంట్‌లో వర్టికల్ కెమెరా సెటప్ ఉండనుందట.
భారీ డిస్‌ప్లే
ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లలో భారీ డిస్‌ప్లేని కలిగి ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లో 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉండనుందట. ప్రో వెర్షన్లకు మాత్రమే ఇది వర్తించనుంది. ఇలా ఒక్కో మోడల్‌కి ఒక్కో డిస్‌ప్లే సైజుని ఉపయోగించడం ఇదే తొలి సారి కానుంది.
రిలీజ్ ఎప్పుడంటే?
ఐఫోన్ 16 సిరీస్ 2024లో లాంఛ్ కానుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దీనిని రిలీజ్ చేసేలా యాపిల్ ప్లాన్ చేస్తోంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్