• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo 12 Features: తిరుగులేని ఫోన్‌ను లాంచ్‌ చేయబోతున్న ఐకూ.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం ఐకూ (iQOO) త్వరలో మరో సరికొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనుంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘iQoo 11’ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానంగా  ‘iQoo 12’ మెుబైల్‌ను కంపెనీ విడుదల చేయనుంది. iQoo 11 మెుబైల్‌ విజయవంతం కావడంతో టెక్‌ ప్రియుల దృష్టి కొత్త ఫోన్‌పై పడింది. అయితే ‘iQoo 12’కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ కొంత సమాచారం మాత్రం అనధికారికంగా బయటకొచ్చింది. ఐకూ నయా మెుబైల్ చాలా అద్బుతంగా ఉండనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    iQOO 12 మెుబైల్‌ 6.78 అంగుళాల 2K రిజల్యూషన్ కలిగిన కర్వ్‌డ్‌ స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి 144Hz రిఫ్రెష్‌ రేట్‌ అందించినట్లు సమాచారం. భారత్‌లో Snapdragon 8 Gen 3 SoC ప్రొసెసర్‌తో రాబోతున్న మెుట్టమెుదటి మెుబైల్‌ ఇదేనని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

    అడ్వాన్స్‌డ్‌ OS

    ఈ ఫోన్‌ను అడ్వాన్స్‌డ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Funtouch OS 14తో ఐకూ 12 మెుబైల్‌ వర్క్‌ చేయనుందట.

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    iQOO 11 మెుబైల్‌తో పోలిస్తే iQOO 12లో RAM, స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచినట్లు తెలుస్తోంది. 12 RAM / 256GB స్టోరేజ్‌తో నయా మెుబైల్‌ రాబోతున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 

    కెమెరా నాణ్యత

    ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో రానుంది. 50 MP ప్రైమరీ షూటర్‌, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 64 MP హై రిజల్యూషన్‌ టెలిఫొటో లెన్స్‌ ఫోన్‌ వెనక భాగంలో ఉండనున్నాయి. అలాగే 16 MP సెల్ఫీ కెమెరాను కూడా ఫోన్‌కు ఉండనున్నట్లు తెలిసింది.

    బ్యాటరీ సామర్థ్యం

    IQOO 12 స్మార్ట్‌ఫోన్‌కు శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని ఫిక్స్‌ చేస్తారని తెలిసింది. ఇది ఏకంగా 200W సపోర్ట్‌తో రాబోతున్నట్లు లీకైన సమాచారం పేర్కొంది. అదే నిజమైతే ఈ ఫోన్‌ను నిమిషాల వ్యవధిలో ఫుల్‌ ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. 

    నీటి నుంచి రక్షణ

    ఈ ఫోన్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి అవగతమవుతోంది. నీటితో పాటు దుమ్ము, దూళిని తట్టుకునే IP68 rating దీనికి అందించారు. 

    ధర ఎంతంటే?

    iQOO 12 విడుదల తేదీపై తయారీ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్‌ చివరిలో లేదా డిసెంబర్‌ మెుదటి వారంలో ఈ ఫోన్‌ లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫోన్‌ వెల రూ.62,990 వరకూ ఉండొచ్చని భావిస్తున్నాయి. ధరపై స్పష్టత రావాలంటే లాంచ్‌ డే వరకూ ఆగాల్సిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv