చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐకూ (iQOO) మరో సరికొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 7న IQoo 12 సిరీస్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు కన్ఫామ్ చేసింది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ‘iQoo 11’ స్మార్ట్‌ఫోన్‌కు కంప్లీట్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ అయితే అందుబాటులోకి వస్తోంది. ‘iQoo 12లో ఫస్ట్ టైం స్నాప్‌డ్రాగన్ 8జనరేషన్ 3 ప్రాసెసర్‌ను తీసుకొస్తోంది. కెమెరా సెటప్‌లోనూ భారీ మార్పులు అయితే చేసింది. ఫోన్ ఫీచర్లు ఇంకా అధికారికంగా తెలియనప్పటికీ.. సోషల్ మీడియాలో ఐకూ 12 ప్రత్యేకతలు వైరల్‌గా మారాయి. మరి ఫోన్ ప్రత్యేకతలపై ఓ లుక్ వేద్దాం..
IQoo 12 Pro డిజైన్ అండ్ డిస్‌ప్లే
సోషల్ మీడియాలో అందుతున్న లీక్స్ ప్రకారం.. IQoo 12 ప్రో.. 6.78 అంగుళాల పొడవుతో OLED డిస్‌ప్లే 144Hz రిఫ్రేష్ రేటుతో రానుంది. 433ppi పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండనుంది. కర్వ్డ్ డిస్‌ప్లే పంచ్ హోల్‌తో రానుంది. 2K స్క్రీన్ రెజల్యూషన్‌ను కలిగి ఉండనున్నట్లు తెలిసింది. డిస్‌ప్లే IP68 వాటర్/డెస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందని టాక్.
కెమెరా
ఐకూ 12 ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఈ సెటప్ ఫోన్ వెనుక వైపు స్కైర్ ఐలాండ్‌లో ఫిక్స్ చేశారు. దీని పక్కన LED సెన్సార్‌ను అమర్చారు. ప్రధాన కెమెరా 50 MP( Wide Angle)+ 50 MP( Ultra-Wide Angle)+ 64 MP , (Telephoto Camera) కన్ఫిగరేషన్‌తో అయితే వస్తుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలిటీని కలిగి ఉంటుంది. అంతే కాదు… ఇందులోని టెలిఫోటో కెమెరాలో.. 3x optical zoomతో పాటు 100x digital zoomను స్పెషల్ ఫీచర్‌గా అందించారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే 24MP సెటప్‌తో రానుంది.
ప్రాసెసర్
ఐకూ తన గ్యాడ్జెట్స్‌లో Snapdragon 8 Gen 3 చిప్ సెట్‌ను ఐకూ 12 సిరీస్‌లో తీసుకొస్తోంది. ఇది శక్తివంతమైన లెటెస్ట్ ప్రాసెసర్. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Funtouch OS 14తో ఐకూ 12 సిరీస్ రన్ అవుతుంది.
కనెక్టివిటీ
ఐకూ తన బ్రాండ్ అన్ని ఫోన్లలో అందిస్తున్న విధంగానే ఈ ఫోన్‌లో ఏదీ స్కిప్ చేయలేదు. IR blaster, Bluetooth 5.4, NFC, Wi-Fi 7, కంపాస్, గైరోస్కోప్, GPS కనెక్టివిటీని అయితే అందిస్తోంది.
బ్యాటరీ
iQOO 12 సిరీస్ లార్జ్ బ్యాటరీ సెల్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ కెపాసిటీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 10 నిమిషాల్లోనే 50శాతంపైగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్:
ఐకూ 12 సిరీస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 12GB/16GB/24GB RAMతో 256GB/512GB/1TB స్టోరేజ్ ఆప్షన్లను అయితే అందిస్తోంది.
కలర్స్:
ఐకూ 12 సిరీస్ మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అవి బ్లాక్, వైట్, రెడ్. ఈ మూడు కలర్స్ కూల్ లుక్‌తో ప్రీమియం అపియరన్స్‌ను అయితే అందిస్తాయి.
ధర
ఐకూ 12 సిరీస్ ధర వేరియంట్‌ను బట్టి రూ.51,999- రూ. 69,990 మధ్య ఉండనుంది. నవంబర్ 7న లాంచింగ్ అయిన తర్వాత ఈ ఫోన్ సెల్స్‌కు రానుంది. సెల్స్‌కు వచ్చాక ఐకూ 12 ఫోన్లపై బ్యాంకులు డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!