• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • iQoo Neo 7 Pro 5G: అదిరే డిస్‌ప్లేతో భారత్‌లోకి మరోకొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

    వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ(iQoo) నుంచి సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఐకూ నియో 7 ప్రో 5G(iQoo Neo 7 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ని భారత్‌లో జులై 4న లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. పంచ్ హోల్ డిస్‌ప్లేతో మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, గతేడాది చైనాలో విడుదల చేసిన ఐకూ నియో 7 రేసింగ్ ఎడిషన్‌కి రీబ్రాండ్ మొబైల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ని తీసుకొస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లపై నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. 

    స్టోరేజీ

    ఐకూ నియో 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో హై ఎండ్ స్మార్ట్‌‌ఫోన్ అందుబాటులోకి రానుంది.

     

    కెమెరా

    నియో 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. 50 మెగాపిక్సెల్ క్లారిటీతో ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్‌తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ క్లారిటీతో మ్యాక్రో కెమెరా ఈ సెటప్‌లో ఉండనుంది. ఇక, 16 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ కెమెరా రానుంది. 

    డిస్‌ప్లే

    పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఐకూ నియో 7 ప్రో 5G మొబైల్ రానుంది. 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 1080*2400 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉండనుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేటు 144Hz, టచ్ సాంప్లింగ్ రేటు 360 Hzగా ఉండనుంది.

    బ్యాటరీ

    మెరుగైన బ్యాటరీ బ్యాకప్ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 5,000mAh. దీంతో పాటు 120వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అడాప్టర్ కూడా రానుంది. 

    పర్ఫార్మెన్స్

    క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 చిప్‌సెట్‌తో 3.2GHz ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రానుంది. 8 GB వర్చువల్ ర్యామ్ అదనంగా జత కానుంది. ఆండ్రాయిడ్ 13 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లై ఫింగర్ ప్రింట్ సెన్సార్ రానుంది. 

    కలర్స్

    ఐకూ నియో 7 ప్రో 5G ఆరెంజ్ కలర్‌లో ఉండనుందని కంపెనీ వెల్లడించింది. ట్విటర్‌లో షేర్ చేసిన వీడియోలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. 

    ధర

    ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై కంపెనీ ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. భారత్‌లో రూ.36,990 నుంచి బేస్ వేరియంట్ ధర ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv