చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐకూ (iQOO) మరో సరికొత్త ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘iQoo Neo 9 Series’ను త్వరలోనే లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. గతంలో తీసుకొచ్చిన ‘iQoo Neo 8 Series’లో కీలక మార్పులు చేసి కొత్త సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. ‘iQoo Neo 9’, ‘iQoo Neo 9 Pro’ పేర్లతో కొత్త మెుబైల్స్ రానున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ముందే లీకయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
iQOO Neo 9 మోడల్ ఫోన్ 6.8 అంగుళాల HDR10+ స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 2000 nits పీక్ బ్రైట్‌నెస్, 144 Hz రిఫ్రెష్ రేట్, 480 Hz Touch Sampling Rate, 1080 x 2400 pixel క్వాలిటీని డిస్‌ప్లే అందించినట్లు సమాచారం. Android v14, Mediatek Dimensity 9300 Chipsetతో ఫోన్ వర్క్ చేయనున్నట్లు తెలిసింది.
కెమెరా క్వాలిటీ
అద్భుతమైన ట్రిపుల్ రియర్ కెమెరాలలో కొత్త ఐకూ మెుబైల్ వస్తున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. ప్రైమరీ కెమెరాగా 1.49 అంగుళాల 50 MP Sony IMX 920 సెన్సార్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. దీనికి అదనంగా 50 MP + 32 MP OIS సెన్సార్లు కూడా అందిస్తారని సమాచారం. ఇక ముందు 32 MP సెల్ఫీ కెమెరా ఫోన్ మార్కెట్‌లోకి రానుంది.
స్టోరేజ్ సామర్థ్యం
iQOO Neo 9 మోడల్ ఫోన్స్ రెండు వేరియంట్లలో రానున్నట్లు సమాచారం. 12GB RAM / 256GB ROM, 16GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఇవి లాంచ్ కానున్నాయి.
బ్యాటరీ
ఐకూ నియో 9 ఫోన్లను 5000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనికి ఏకంగా 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తారని సమాచారం. ఇదే నిజమైతే ఈ ఫోన్‌ను నిమిషాల వ్యవధిలో ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
అడిషనల్ ఫీచర్లు
ఈ ఐకూ మెుబైల్‌లో 5G, 4G VoLTE, Bluetooth v5.3, WiFi, USB-C v2.0, IR Blaster, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి.
ధర ఎంతంటే?
Neo 9 మోడల్ ధర, విడుదల తేదీని ఐకూ అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని టెక్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. మెుబైల్ ధర కూడా రూ.43,990 వరకూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!