iQoo బ్రాండ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. iQoo Z7 Pro 5G పేరుతో ఆగష్టు 31న లాంచ్ కానుంది. Vivo కంపెనీ సబ్-బ్రాండ్ అయిన ఐకూ.. ఐకూ Z7 ప్రో గురించి అనేక వివరాలు వెల్లడించింది. కర్వ్డ్ డిస్‌ప్లే, హోల్ పంచ్ కటౌట్‌తో ఆకర్షిస్తున్న ఈ ఫొన్ స్మార్ట్ ఫీచర్లు, ధర ఎలా ఉండబోతుందో ఈ కథనంలో చూద్దాం.
iQoo Z7 Pro 5G డిస్‌ప్లే
ఐకూ Z7కు కొనసాగింపుగా iQoo Z7 Pro మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఈ స్మార్ట్ ఫొన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో రానుంది. హ్యాండ్‌సెట్ యాంటీగ్లేర్ గ్లాస్ ఫినిషింగ్‌తో మరింత ఆకర్షనీయంగా కనిపించనుంది. 6.78 పొడవుతో కర్వ్డ్ డిస్‌ప్లే ఉండనుంది.
కెమెరా
iQoo Z7 Pro.. 64-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలో ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS) వంటి ప్రత్యేక ఫీచర్‌ను అమర్చారు. దీనివల్ల ఫొటోలు మరింత నేచురల్ టోన్‌లో కనిపిస్తాయి. అలాగే 16 మెగాఫిక్సెల్ సామర్థ్యంతో ఫ్రంట్ లేదా సెల్ఫీ కెమెరా రానుంది. అయితే వైడాంగిల్ లెన్స్ మాత్రం కెమెరాలో లేవు.
చిప్‌సెట్
iQoo Z7 Pro హ్యాండ్‌సెట్ MediaTek డైమెన్సిటీ 7200 5G SoC చిప్‌సెట్‌ను కలిగి ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన Vivo V27 చిప్‌సెట్‌పైనే నడుస్తుంది. బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ AnTuTuలో iQoo హ్యాండ్‌సెట్ 7,00,000 పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. ఈ ఐకూ స్మార్ట్ ఫొన్ 7.36mm మందంతో స్లిమ్ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. iQoo Z7 Pro 5G ఆండ్రాయిడ్ 13పై నడుస్తుంది.
స్టోరేజ్ &బ్యాటరీ
ఐకూ గ్యాడ్జెట్ 8GB, 12GB ర్యామ్ వేరియంట్లతో 128జీబీ స్టోరేజ్, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో అందుబాటులో ఉండనుంది. బ్యాటరీ కెపాసిటీ 4,600mah కలిగి ఉండి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
iQoo Z7 Pro 5G ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో ర్యామ్ వేరియంట్‌ను బట్టి రూ.25,000- రూ.30,000 మధ్య ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆగస్టు 31న లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ఐకూ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ సైట్‌లో అందుబాటులో ఉండనుంది. iQoo Z7 Pro ఫొన్ కోసం ముందస్తు బుకింగ్స్ కూడా త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
మొత్తానికి మీడియం బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ ఫీచర్లు అందిస్తున్న స్మార్ట్ ఫొన్‌లలో iQoo Z7 Pro ఒకటిగా చెప్పవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!