ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఐకూ (iQoo) భారత మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐకూ జెడ్7 సిరీస్ (iQoo Z7 Series) నుంచి సరికొత్త మొబైల్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐకూ జెడ్7 5జీ (iQoo Z7 5G), ఐకూ జెడ్7ఎస్ 5జీ (iQoo Z7S 5G) స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఐకూ జెడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) మోడల్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఎలాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
ఐకూ జెడ్7 ప్రో 5జీ (iQOO Z7 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను పుల్ హెచ్‌డీ+ కర్వ్‌డ్ అమొలెడ్ సూపర్ విజన్ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ (Dimensity 7200 SoC)తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13, ఫన్‌టచ్ ఓఎస్13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో ఇన్‌బిల్ట్ చేశారు.
కెమెరా క్వాలిటీ
iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కు క్వాలిటీ కెమెరా సెటప్ ఫిక్స్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 64MP ప్రైమరీ కెమెరాను అమర్చారు. 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్‌ను ఫోన్‌కు అందించారు. రియర్ కెమెరాలో స్పోర్ట్స్, నైట్, పోర్ట్రెయిట్, ఫోటో, వీడియో, 64MP, పనోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్, ప్రో, లైవ్ ఫోటో, డాక్యుమెంట్, డ్యూయల్ వ్యూ వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం
iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని కాస్త తగ్గించినట్లు కనిపిస్తోంది. ఇందులో 4600mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. అయితే దీనికి 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించడం విశేషం. దీని ద్వారా బ్యాటరీని చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.
స్టోరేజ్ సామర్థ్యం
ఐకూ జెడ్7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8GB RAM + 128GB ROM, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చారు. మీ స్టోరేజ్ అవసరాన్ని బట్టి తగిన వేరియంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
కలర్స్
iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో మార్కెట్‌లో విడుదలైంది. బ్లూ లగూన్, గ్రాఫైట్ మ్యాటీ కలర్స్‌లో మీకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవచ్చు.
ధర ఎంతంటే?
iQOO Z7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. HDFC బ్యాంక్ కార్డులతో కొంటే రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!