• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!

    టాలీవుడ్‌ ఫ్యూచర్‌ హీరోయిన్స్‌గా బాలీవుడ్‌ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్‌లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్‌ లభిస్తే ఈ భామలకు వరుస అవకాశాలు రావడం ఖాయమంటూ పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా తొలి చిత్రాలతో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకోలేకపోయారు. ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr.Bachchan) సినిమా ద్వారా భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. అటు జాన్వీ (Janhvi Kapoor)కి సైతం ‘దేవర’తో మంచి సక్సెస్‌ వచ్చినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో పెద్దగా హైలెట్‌ కాలేదు. దీంతో ఈ ఇద్దరు ముద్దుగమ్మలు తమ తర్వాతి చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. 

    భారమంతా చరణ్‌పైనే!

    శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్‌ తారక్ వంటి బిగ్‌ స్టార్‌ నటించిన ‘దేవర’తో తెలుగులో అడుగుపెట్టింది. రిలీజ్‌కు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్ద ఎత్తున బజ్‌ ఏర్పడింది. ప్రమోషన్స్‌లోనూ జాన్వీ చురుగ్గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తీరా సినిమా రిలీజయ్యాక జాన్వీ పాత్ర అందరినీ ఊసురుమనిపించింది. ఆమె చేసిన తంగం పాత్ర గెస్ట్‌రోల్‌ను తలపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ తీవ్రంగా నిరాశపడ్డారు. దీంతో జాన్వీ ఆశలన్నీ రామ్‌ చరణ్- బుచ్చి బాబు కాంబోలో రానున్న ‘RC 16’ ప్రాజెక్ట్‌పైకి మళ్లాయి. అయితే ఈ సినిమాలోనైనా జాన్వీకి మంచి పాత్ర దొరుకుతుందా? లేదా? అన్న సందేహాం ప్రస్తుతం ఆమె ఫ్యాన్స్‌లో ఉంది. నటిగా ఇప్పటికే నిరూపించుకున్న జాన్వీ మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ పాపులర్ కావడం ఖాయమని చెప్పవచ్చు. RC 16తో ఈ భామ ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. 

    బ్రైట్‌గా భాగ్యశ్రీ బోర్సె ఫ్యూచర్!

    ‘మిస్టర్‌ బచ్చన్’ రిలీజ్‌కు ముందు వరకూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. ఫ్యూచర్‌ క్వీన్‌ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ డిజాస్టర్‌గా నిలవడంతో ఆమె పెట్టుకున్న నమ్మకాలన్నీ ఆవిరి అయ్యాయి. అయితే నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండ సరసన ‘VD12’లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే రీసెంట్‌గా దుల్కర్‌ సల్మాన్‌తో ఓ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. ‘కాంత’ అనే పేరుతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు పలువురు కుర్ర హీరోలు సైతం భాగ్యశ్రీతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. దీంతో మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌ అయినా ఈ అమ్మడి ఫేమ్‌కు ఎలాంటి ఢోకా లేదని చెప్పవచ్చు. సరైన హిట్‌ లభిస్తే భాగ్యశ్రీ తెలుగులో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా మారిపోవడం పక్కా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

    శ్రీదేవి కూతురి నుంచి స్టార్‌ హీరోయిన్ వరకూ!

    శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మరాఠీ చిత్రం ‘సైరాత్’కు రీమేక్‌గా వచ్చిన ‘ధడక్‌’లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుడ్‌లక్‌ జెర్రీ’, ‘మిలి’, ‘బవాల్‌’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు పెద్దగా సక్సెస్‌ రాలేదు. ఈ క్రమంలోనే ‘రాఖీ ఔర్‌ రానీకి ప్రేమ్‌ కహానీ’ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి జాన్వీ అందరి దృష్టిని ఆకర్షించింది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ‘మిస్టర్ అండ్ మిస్ మహీ’, ‘ఉలాజ్‌’ చిత్రాల్లో ఫీమేల్‌ లీడ్‌గా చేసి నటనపరంగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హిందీలో ‘సన్నీ శాన్‌స్క్రీట్‌ కి తుల్సీ కుమారి’ అనే చిత్రంలో జాన్వీ నటిస్తోంది. 

    భాగ్యశ్రీ నేపథ్యం ఇదే..

    భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పుణే. హిందీ చిత్రం ‘యారియాన్ 2’తో ఆమె వెండితెరకి పరిచయమైంది. అంతకుముందు చాలా యాడ్స్‌లో మోడల్‌గా పని చేసింది. ఈమె చేసిన యాడ్స్‌లో క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చి పెట్టింది. ఇక ‘యారియాన్ 2’లో ఈ బ్యూటీ యాక్టింగ్‌కి ఫిదా అయిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. ‘మిస్టర్ బచ్చన్‌’లో ఛాన్స్ ఇచ్చారు. అలా టాలీవుడ్‌లో బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. చూడటానికి చాలా క్యూట్‌గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ సినిమాలకు అతీతంగా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv