బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది.
ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్ చేశాడా? అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.
మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్ జోహార్ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.
ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్‌తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది.
శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో ‘దేవర’ చిత్రంలో నటిస్తోంది. న్యూయర్ సందర్భంగా దేవర పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. జనవరి 8న సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ గ్లింప్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.
ఇక దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ టామ్ చాకోలు విలన్స్‌గా కనపడబోతున్నారు.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్.
ఇక జాన్వీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్