కేజీఎఫ్ 2, కాంతార తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న పెద్ద చిత్రం కబ్జ. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ట్రైలర్ కేజీఎఫ్ తరహాలో కనిపిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ప్రేక్షకులతో పాటు ముగ్గురు హీరో అభిమానులు థియేటర్లకు వరుస కట్టారు. మరి, సినిమా ఎలా ఉంది? ముగ్గురు సూపర్ స్టార్‌లను పెట్టి దర్శకుడు న్యాయం చేశాడా? లేదో చూద్దాం.
దర్శకుడు: ఆర్. చంద్రూ
నటీ నటులు: ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ తదితరులు
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: ఏ.జే.శెట్టి
కథేంటి?
దేశానికి స్వాతంత్య్రం రావటానికి ముందు జరిగిన కథ ఇది. ఆరకేశ్వర ( ఉపేంద్ర ) ఎయిర్‌ఫోర్స్ అధికారి.. పరిస్థితుల కారణంగా అండర్ వరల్డ్ డాన్‌గా మారతాడు. దేశాన్ని శాసిస్తున్న అతడిని ఎదుర్కొనేందుకు బ్రిటీష్ ప్రభుత్వం భార్గవ్ భక్షి ( కిచ్చా సుదీప్) ను నియమిస్తుంది. వారి నుంచి ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో శివరాజ్ కుమార్ పాత్ర ఏంటి? అనేది కథ.
ఎలా ఉందంటే?
కబ్జ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే కేజీఎఫ్‌తో పోల్చడం ప్రారంభించారు. థియేటర్లకు వెళ్లేముందు ఆ సినిమాను దృష్టిలో పెట్టుకొని వెళ్తుండటంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు.
సినిమా ప్రారంభం నుంచే మనకు కొద్దిగా ఆ ఫీలింగ్ రావటం సహజం. ఎందుకంటే బ్యాక్‌డ్రాప్‌తో పాటు హీరో గ్యాంగ్‌స్టర్ కావటం, అతడితో ప్రభుత్వం యుద్ధం చేయడమనేది కేజీఎఫ్ లాంటి కథే.
ఉపేంద్ర రెండు పాత్రల్లోనూ బాగా నటించాడు. సినిమాను తన భుజాలపైన మోస్తూ ముందుకు తీసుకెళ్లాడు.
కేజీఎఫ్ ఫ్లేవర్ ఉన్నప్పటికీ దర్శకుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ముఖ్యంగా స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. ఇందులో చంద్రూ విఫలమయ్యాడనే చెప్పాలి.
కిచ్చా సుదీప్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. చిత్రంలో శివన్న చేసిన గెస్ట్ రోల్ బాగున్నా ఎక్కువ సమయం లేకపోవడం మైనస్.
సాంకేతికంగా..
కబ్జ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. రవి బస్రూర్ మరోసారి తన సంగీతంతో మెప్పించారు. ప్రతి సన్నివేశాన్ని బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో అద్భుతంగా వచ్చేలా చేయటానికి ప్రయత్నించాడు రవి.
సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగా చేయాల్సి ఉండేదనే విమర్శలు వస్తున్నాయి. డల్ కలర్ టోన్ ఉంది.
సినిమాలో ముఖ్యంగా వీఎఫ్‌క్స్ గురించి చెప్పుకోవాలి. ఇవి చాలా పేలవంగా ఉన్నాయి. ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించవు.
క్లైమాక్స్‌లో కబ్జ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌పై పార్ట్ 2 ఆధారపడి ఉంది.
బలాలు
నటీనటులు
ఉపేంద్ర
సంగీతం
బలహీనతలు
కథ
స్క్రీన్ ప్లే
కేజీఎఫ్ తరహా సీన్లు
రేటింగ్: 2.75/5
కేజీఎఫ్‌ను ఊహించుకోకుండా కబ్జ సినిమాను చూస్తే నచ్చుతుంది
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..