టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు. కాజల్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అని చెప్పవచ్చు. ఆమె టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల జాబితాలో నిలిచింది. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించింది. మరోవైపు ఆమె 30కి పైగా హిందీ సినిమాల్లో నటించింది. కాజల్‌కు ఉన్న ఫ్యాన్స్, ఫాలోవర్స్ సంఖ్య తక్కువేమి కాదు.
కాజల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
1. కాజల్ అగర్వాల్ జూన్ 19, 1985న ముంబయిలోని పంజాబీ కుటుంబంలో జన్మించింది.
2. 2020లో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు బొమ్మను ఏర్పాటు చేసిన మొదటి దక్షిణ భారతీయ నటి కాజల్ అగర్వాల్.
3. కాజల్ 2004లో క్యూ హో గయానా చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో వివేక్ ఒబెరాయ్‌తో కలిసి చిన్న పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
4. 2006లో తెలుగులో లక్ష్మీ కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఘనవిజయాన్ని సాధించింది.
5. ఆ తర్వాత చందమామ(2007), మగధీర (2009), మిస్టర్ పర్‌ఫెక్ట్ (2011), బిజినెస్‌మ్యాన్(2012), తుపాకి (2012) ఇలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది.
6. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయినే. ఆమె సోలో, ఏమైంది ఈవేళ వంటి సినిమాల్లో నటించింది.
7. కాజల్ అక్టోబర్ 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లిచేసుకుంది. ఈ దంపతులకు ఏప్రిల్ 19, 2022న నీల్ కిచ్లూ జన్మించాడు.
కాజల్ అగర్వాల్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఆమె ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజున, మీకు ఇష్టమైన నటి గురించి మరింత తెలుసుకోవడం మీరు ఆనందించారని మేము ఆశిస్తున్నాము. మీరు కాజల్ ఫ్యాన్ అయితే, మీకు ఈ కథనం నచ్చితే దీన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి.